dil raju: పెళ్లిచూపులు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై.. అర్జున్ రెడ్డితో స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. కుర్రాలకు అతనొక బ్రాండ్ అయితే, అమ్మాయిలకు రౌడీ లవర్. సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇప్పుడు పెద్ద సినిమాలకు ముఖ్య అతిథిగా వచ్చే రేంజ్‌కు ఎదగడం వెనక అతని అలుపెరగని కష్టం దాగుంది. అయితే, విజయ్‌ని పవన్ కల్యాణ్‌తో పోలుస్తూ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశిష్ హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ రెండో సాంగ్ విడుదల కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ్ దేవరకొండ వచ్చారు. కాగా, విజయ్ తనకు ఎంతోకాలంగా తెలుసని అన్నారు. తన బ్యానర్‌పై వచ్చిన కేరింత సినిమా ఆడిషన్స్‌కు విజయ్ ఓ సారి తన ఆఫీసుకు వచ్చాడని దిల్ రాజు అన్నారు. అందులో ముగ్గరు హీరోల్లో ఒకరిగా విజయ్ నటించాల్సిందని.. కానీ కుదరలేదని పేర్కొన్నారు.
ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తో విజయ్ స్టార్ అవ్వడం అందరికీ తెలిసిందేనని అన్నారు. గీతా గోవిందం సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా తనను పిలిచినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అతి తక్కువ కాలంలో మూడు నాలుగు చిత్రాలతో విజయ్‌కు ఇంత క్రేజ్ రావడం ఆశ్చర్యకరమని దిల్‌రాజు కొనియాడారు. తెలుగు ఇండస్ట్రీకి మరో యూత్‌ఫుల్ హీరో, పవన్ కల్యాణ్ దొరికాడని అన్నారు. దీంతో పాటు లైగర్ తో పాన్ ఇండియా హీరోగా పరిచయమవనున్న విజయ్‌కు అభినందనలు తెలుపుతూ స్పీచ్ ముగించారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.