Homeఎంటర్టైన్మెంట్balakrishna: అఖండ విడుదల తేదీపై బాలయ్య అభిమానులకు తప్పని నిరాశ.

balakrishna: అఖండ విడుదల తేదీపై బాలయ్య అభిమానులకు తప్పని నిరాశ.

balakrishna: బాలయ్య,బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మూడవ చిత్రం అయినా అఖండ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.ఎప్పుడో విడుదల కానున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా వేసింది చిత్రబృందం.

బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. సింహా ,లెజెండ్, రేండు సినిమా లు ప్రేక్షకులలో మంచి విజయాలు అందుకున్నాయి.భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విడుదల తేదిపై ఇంతవరకు సరైన సమాచారం లేదు. ఈ సినిమా ఈ వచ్చే నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదలకానుందని వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుత సమాచారం మేరకు ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా లో సమాచారం.

ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని టాక్. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఈ చిత్రంని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని బాలయ్య సరసన త్రిష నటిస్తున్నారని సమాచారం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular