https://oktelugu.com/

దీపావళికి పేలనున్న ‘లక్ష్మీబాంబ్’

కరోనా ఎఫెక్టుతో థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదాపడిన సంగతి తెల్సిందే. దీంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు, టీవీలకు అలవాటుపడిపోయారు. కరోనాకు ముందే బాలీవుడ్లో ‘లక్ష్మీబాంబ్’ మూవీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసే సమయానికి కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతుందని భారీగా ప్రచారం జరిగింది. అయితే దీనిని చిత్రయూనిట్ పలుసార్లు కొట్టిపారేసింది. Also Read: డ్రగ్స్ కేసులో కథనాలపై ఢిల్లీ హైకోర్టుకు రకూల్ అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 03:53 PM IST

    laxmi bomb

    Follow us on

    కరోనా ఎఫెక్టుతో థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదాపడిన సంగతి తెల్సిందే. దీంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు, టీవీలకు అలవాటుపడిపోయారు. కరోనాకు ముందే బాలీవుడ్లో ‘లక్ష్మీబాంబ్’ మూవీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసే సమయానికి కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతుందని భారీగా ప్రచారం జరిగింది. అయితే దీనిని చిత్రయూనిట్ పలుసార్లు కొట్టిపారేసింది.

    Also Read: డ్రగ్స్ కేసులో కథనాలపై ఢిల్లీ హైకోర్టుకు రకూల్

    అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కులను దక్కించుకున్న హాట్ స్టార్ సంస్థ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 14 దీపావళి పండుగ ఉండగా ఆరురోజుల ముందుగానే అంటే నవంబర్ 9న ఈ మూవీ ఓటీటీలో ప్రసారం కానుంది.

    తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ‘కంచన’ మూవీ బాలీవుడ్లో ‘లక్ష్మీబాంబ్’గా రాబోతుంది. ‘కంచన’లో హీరోగా నటించిన లారెన్స్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై బాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. థియేటర్లలోనే రిలీజ్ కావాల్సిన ఈ భారీ మూవీ కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీలో వస్తోంది.

    Also Read: దేవదాసిగా మారనున్న అనసూయ?

    ఓటీటీలో గత ఆరునెలలుగా అనేక  కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మాస్ ప్రేక్షకులను అలరించేలా ఒక్క మూవీ కూడా ఓటీటీలో రాలేదు. ఆ లోటును ‘లక్ష్మీబాంబ్’ తీర్చనుండటంతో ఆ వర్గం ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. దీపావళి కానుకగా ‘లక్ష్మీబాంబ్’ రిలీజ్ కానుందని హాట్ స్టార్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ తో జోరుగా ప్రచారం చేస్తున్నారు.