https://oktelugu.com/

Lavanya: సూపర్​స్టార్​ సరసన లక్కీ ఛాన్స్ కొట్టిన లావణ్య త్రిపాఠి!

Lavanya: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందం, అభినయంతో మంచి హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న నటి లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో మంచి నటన కనబరిచింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే, వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్​గా మారే ఛాన్స్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవలే గీతాఆర్ట్స్ బ్యానర్​పై హీరో కార్తికేయ నటించిన చావుకబురు చల్లగా సినిమాలో హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా హిట్​గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 02:34 PM IST
    Follow us on

    Lavanya: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందం, అభినయంతో మంచి హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న నటి లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో మంచి నటన కనబరిచింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే, వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్​గా మారే ఛాన్స్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవలే గీతాఆర్ట్స్ బ్యానర్​పై హీరో కార్తికేయ నటించిన చావుకబురు చల్లగా సినిమాలో హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా హిట్​గా నిలిచినప్పటికీ.. లావణ్యకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల గ్లామల్​ లుక్స్​తో ఈ సొట్టబుగ్గల సుందరి హాట్​ ఫోటో షూట్స్​లో పాల్గొంటూ..  నెట్టింట షేర్ చేస్తోంది.

    ఈ క్రమంలోనే మహేశ్ సరసన ఛాన్స్ కొట్టినట్లు ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది. మహేశ్​- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో లావణ్య లక్కీ ఛాన్స్ కొట్టిందని సమాచారం. ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాటతో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో మొదటి హీరోయిన్​గా పూజా హెగ్డెను ఎంపిక చేశారు.

    ఇప్పుడు సెకెండ్ హీరోయిన్​గా లావణ్యను తీసుకున్నట్లు తెలుస్తోంది.  మొదట ఈ పాత్ర కోసం నభా నటేష్ పేరు వినపించినా.. ఎట్టకేలకు లావణ్యకే ఆ ఛాన్స్ దక్కింది.  దీంతో లావణ్యకు ఈ సినిమాతోనైనా స్టార్​ హీరోయిన్​ గుర్తింపు దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు.  ప్రస్తుతం త్రివిక్రమ భీమ్లా నాయక్​ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్​ స్క్రీన్​ ప్లే తో పాటు మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.