Lavanya Tripathi strong counter: రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలైన ‘ఆట’ డ్యాన్స్ రియాలిటీ షోకి ఆరంభం లోనే అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ షోకి ఉన్నటువంటి ఊపు ని చూస్తుంటే రాబోయే రోజుల్లో చాలా పెద్ద డ్యాన్స్ షో అయ్యేలా అనిపిస్తోంది. ఈ షోలో డ్యాన్స్ వేస్తున్న కంటెస్టెంట్స్ ని చూస్తే నోటి నుండి మాట రావడం కూడా కష్టమే . ఎక్కడి నుండి తీసుకొచ్చారో కానీ, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అన్నట్టుగానే డ్యాన్స్ వేస్తున్నారు. ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, జానీ మాస్టర్, రాధికా మరియు నిహారిక కొణిదెల జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జానీ మాస్టర్ మొదటి నాలుగు ఎపిసోడ్స్ కి వచ్చాడు కానీ, ఈ వారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ కి మాత్రం ఆయన షూటింగ్ కారణంగా రాలేకపోయాడు.
ఆయనకు బదులుగా రఘు మాస్టర్, సీనియర్ హీరోయిన్ రంభ ఈ వారం ఎపిసోడ్స్ లో మెరవబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ షోకి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గెస్ట్ గా వచ్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సతీ లీలావతి’ ప్రొమోషన్స్ లో భాగంగా, ఈ షోలో పాల్గొన్నది. ఈమెని చూడగానే నిహారిక కొణిదెల వదినా అంటూ స్టేజి మీదకు వచ్చి గట్టిగా హాగ్ చేసుకుంటుంది. అనంతరం సుడిగాలి సుధీర్ తో నిహారిక, లావణ్య త్రిపాఠీ చేసే ఫన్నీ కామెడీ ఈ వారం ఎపిసోడ్ కి హైలైట్ కానుంది. లావణ్య త్రిపాఠీ ని సుధీర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ముందు మీరు ప్రపోజ్ చేశారా?, లేదా వరుణ్ తేజ్ గారు మీకు ప్రపోజ్’ చేసారా అని అడగ్గా , అందుకు లావణ్య త్రిపాఠి,’నీకెందుకు చెప్పాలి మా ప్రేమ వ్యవహారం’ అని అంటుంది.
అనంతరం సుధీర్ నిహారిక తో మాట్లాడుతూ ‘మనలో మన మాట..ఆడపడుచు కట్నం ఏమైనా తీసుకున్నారా?’ అని అడగ్గా, ‘ఇలా అడిగినందుకు నిన్ను కూడా జైలు లో పెట్టిస్తాదట’ అని నిహారిక సమాధానం చెప్తుంది. అప్పుడు సుధీర్ ‘అందుకే తెలుగు ఆమెకు పూర్తిగా రాదు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను’ అని అంటాడు. అప్పుడు లావణ్య ‘నాకు తెలుగు బాగా వచ్చు, బూతులు కూడా వచ్చు’ అని అంటుంది. వరుణ్ గారికి ఇక్కడి నుండి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని లావణ్య ని అడగ్గా, అరగంటలో ఇంటికి వెళ్తాను కదా, అప్పుడు చెప్తాను అని కౌంటర్ ఇస్తుంది లావణ్య. ఇలా సుడిగాలి సుధీర్ కి నాన్ స్టాప్ గా పంచుల మీద పంచులు పడుతూనే ఉంటాయి. చాలా ఫన్నీ గా అనిపిస్తున్న ఈ రెండు ప్రోమోలను మీరు కూడా చూసేయండి.