Lavanya Tripathi and Varun Tej : టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) దంపతుల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. సుమారుగా ఐదేళ్ల పాటు డేటింగ్ చేసుకున్న ఈ జంట, తమ ఇంటి పెద్దలను ఒప్పించి 2023 నవంబర్ 1న విదేశాల్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి కానీ, పెళ్లి వీడియో మాత్రం బయటపెట్టలేదు. అది మా ప్రైవేట్ వీడియో, ఎన్నో మధుర క్షణాలు దాగి ఉన్నాయి, వాటిని మేము పబ్లిక్ చేయాలనీ అనుకోవడం లేదంటూ లావణ్య త్రిపాఠి గతంలో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పేర్కొనింది. ఇదంతా పక్కన పెడితే పెళ్లి సరిగ్గా ఏడాది పూర్తి అయినా వెంటనే వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాము అంటూ ఒక శుభవార్త ని అభిమానులతో ఇటీవలే షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : వరుణ్ తేజ్ షాకింగ్ మేకోవర్, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెగా హీరో!
దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు ఎంతో సంతోషించారు. ఇక పోతే రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక క్యూట్ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇందులో వరుణ్ తేజ్ లావణ్య కోసం పుట్టగొడుగులతో స్పెషల్ గా ఒక పిజ్జా ని రెడీ చేస్తూ కనిపించాడు. ఆ పిజ్జా ని చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. కడుపు తో ఉన్న ఏ భార్య కి అయినా రకరకాల వంటకాలను తినాలని అనిపిస్తూ ఉంటుంది. దానికి భర్త కచ్చితంగా సహకరించాలి. ఈ వీడియో ని చూస్తుంటే వరుణ్ తేజ్ లావణ్య ని కాళ్ళు కూడా క్రింద పెట్టనిచ్చేలా అనిపించడం లేదు, అంత సుకుమారంగా తన భార్య ని చూసుకుంటున్నాడు. దీనిపై సోషల్ మీడియా లో అనేక ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాపం వరుణ్ భయ్యా, సినిమా షూటింగ్స్ కూడా ఆపేసి ఈ పని మీదనే ఉన్నట్టు ఉన్నాడు, ఎంత కష్టమొచ్చింది, బాగా ట్రైనింగ్ ఇచ్చావ్ లావణ్య అక్కా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది అమ్మాయిలు అయితే ఇలాంటి భర్త మాకు కూడా దొరికితే బాగుండును, నువ్వు చాలా లక్కీ లావణ్య అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే, ఈమధ్య కాలం లో ఆయన చేసిన సినిమాలన్నీ ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ తో చేసిన F3 ఒక్కటే ఆయన చివరి హిట్. ఆ తర్వాత చేసినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన లేటెస్ట్ చిత్రం ‘మట్కా’ అయితే కనీసం వార రోజులు కూడా థియేటర్స్ లో నిలబడలేదు. కెరీర్ పరంగా చాలా లౌ ఫేస్ ని ఎదురుకుంటున్న వరుణ్ తేజ్ కి బిడ్డ పుట్టిన తర్వాత బాగా కలిసి వస్తుందని మెగా అభిమానులు చెప్పుకొచ్చారు.
Also Read : కొత్త ఇంట్లోకి వెళ్లిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?