Mahesh Babu and Rajamouli : దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)… ఈయన చేయబోతున్న వరుస సినిమాలతో మంచి విజయాలను కూడా సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షక అభిమానులందరికి మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక రాజమౌళి మహేష్ బాబు తో ఈ సినిమా చేయడానికి ముందే మరొక హీరో తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు కానీ అది వర్కౌట్ అవలేదు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూర్య (Surya) హీరోగా త్రిబుల్ ఆర్ (RRR) తర్వాత ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇక మహేష్ బాబుతో సినిమా చేయడానికి రాజులు కమిట్ అయి ఈ సినిమాను చేస్తున్నాడు. నిజానికి ఆయన మహేష్ తో సినిమా చేయడానికి 20 సంవత్సరాల నుంచి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబో లో సినిమా ఇప్పుడు వర్కౌట్ అయింది అంటూ రాజమౌళి ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం. మరి ఆయన చేస్తున్న ఈ సినిమాలో ఆయనకు ఎలాంటి గుర్తింపును సంపాదించి పెడతాయి. తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి దక్కని క్రేజ్ అయితే రాజమౌళికి దక్కింది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తూ ఉండడం విశేషం… మహేష్ బాబు (Mahesh Babu) సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సూర్యతో సినిమా చేస్తాడా? లేదంటే మరే హీరో దగ్గరికైనా వెళ్తాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినప్పటికి రెండో షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీదనే ప్రేక్షకులు చూపైతే ఉంది. వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి 2027 మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంక చాలా రోజులపాటు షూటింగ్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఇటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు భారీ విజయాన్ని సాధిస్తామని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Also Read : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?