Varun Tej: కెరీర్ ఆరంభం నుండి ప్రయోగాలు చేస్తూ ప్రత్యేకత చాటుకున్నాడు వరుణ్ తేజ్. అయితే ఈ మధ్య ఆయన కెరీర్ ఒకింత నెమ్మదించింది. గద్దల కొండ గణేష్ అనంతరం వరుణ్ తేజ్ కి క్లీన్ హిట్ లేదు. ఎఫ్2, ఎఫ్ 3 రెండు వెంకటేష్ తో చేసిన మల్టీస్టారర్స్. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ కాగా, ఎఫ్ 3 పర్లేదు అనిపించుకుంది. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ సోలోగా చేసిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. గని మూవీ కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు. ఒక బాక్సర్ గా కనిపించడం కోసం జిమ్ లో గంటల తరబడి చెమటోడ్చాడు. ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో గని నిరాశపరిచింది.
Also Read: ‘హిట్ 3’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..100 కోట్లకు అతి చేరువలో!
గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కాయి. ఈ చిత్రాలపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ ఆడలేదు. వరుణ్ తేజ్ చివరి చిత్రం మట్కా. నిజ జీవిత సంఘటనల ఆధారంగా పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కించారు. మట్కా వరుణ్ తేజ్ కెరీర్ లో అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నా.. వరుణ్ తేజ్ కి విజయాలు దక్కడం లేదు.
దాంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని వరుణ్ తేజ్ భావిస్తున్నారు. ఈసారి ఆయన దర్శకుడు మేర్లపాక గాంధీతో చేతులు కలిపాడు. ఇండో-కొరియన్ హారర్ కామెడీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. V15 వర్కింగ్ టైటిల్. ఈ మూవీలో వరుణ్ తేజ్ గెటప్ సరికొత్తగా ఉండనుంది. దీనిపై హింట్ ఇస్తూ వరుణ్ తేజ్ లేటెస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. V15 సెట్స్ నుండి వరుణ్ తేజ్ లుక్ లీకైంది. ఆయన గెటప్ గుర్తు పట్టలేనంతగా ఉంది. వరుణ్ తేజ్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
మరోవైపు వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట 2023లో పెళ్లి పీటలు ఎక్కారు. ఇటలీ దేశంలో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. కేవలం మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. వివాహం అనంతరం నటనకు దూరంగా ఉంటున్న లావణ్య తల్లి కాబోతుందని సమాచారం.
View this post on Instagram