
లావణ్య త్రిపాఠికి టాలీవుడ్లో చాలా పేర్లు ఉన్నాయి. సొట్టబుగ్గల సుందరి.. అందాల రాక్షసి అని అభిమానులను ఈ భామను ముద్దుగా పిలుచుకుంటున్నారు. పక్కింటి అమ్మాయిలా కన్పించే ఈ భామ ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ సినిమాలో భారీ విజయం సాధించడంతో తెలుగులో బీజీగా స్టార్ గా మారిపోయింది. అయితే ఇటీవల వరుసగా కొన్ని పరాజయాలు రావడంతో ఈ అమ్మడు ఆచితూచి సినిమాలను చేస్తుంది.
ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్
ఇక కెరీర్ ముగిస్తుందనుకునే సమయంలో నానితో కలిసి ‘భలేభలే మగాడివోయ్’, కింగ్ నాగార్జునతో కలిసి ‘సొగ్గాడే చిన్నినాయానా’ సినిమాలు విజయం అందించాయి. వీటి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రిలీజైన్ ‘అర్జున్ సురవరం’ మంచి విజయం సాధించడంతో లావణ్య మళ్లీ బీజీగా స్టార్ గా మారిపోయింది. కొన్నేళ్లుగా టాలీవుడ్ మూవీల్లో నటిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల అరబోతకు తెరతీసింది. అంతే మంచి కథ దొరికితే బికినీలో అందాల అరబోతకు సిద్ధమేనని ప్రకటించడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో హాకీ క్రీడాకారిణి నటించనుంది. స్పోర్ట్స్ ప్లేయర్ గా కన్పించేందుకు ఈ అమ్మడు రోజు హాకీ నేర్చుకుంటోంది. అంతేకాకుండా కార్తీకేయ హీరోగా నటిస్తున్న ‘చావుకబురు చల్లగా’ మూవీలో నటించనుంది. తమిళంలో ఓ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సీరిస్ హవా నడుస్తుండటంతో మంచి స్క్రీప్ట్ దొరికితే నటించేందుకు సిద్ధమేనంటూ ప్రకటించింది. ‘అందాల రాక్షసి’ బికినీ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.