Happy Birthday Collections: ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, మత్తు వదలరా చిత్రం ఫేమ్ నితీష్ రానా దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ బర్త్డే అనే సినిమా ఇటీవలే విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకు ముందు ట్రైలర్ తో విశేషం గా ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా మొదటి రోజు నుండి అదే స్థాయిలో రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..ఈ చిత్ర దర్శకుడు నితీష్ రానా తెరకెక్కించిన మత్తు వదలరా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అవ్వడం, దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ నుండి తెరకెక్కిన సినిమా అవ్వడం ఈ మూవీ కి పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు..200 కి పైగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం తో దాదాపుగా అన్ని ప్రాంతాలలో సొంతంగానే విడుదల చేసుకున్నారు..కానీ థియేట్రికల్ వేల్యూ ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని సొంతం చేసుకోవాలిసిన అవసరం ఉంది..తొలి రోజు దాదాపుగా 30 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను సాధించి మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని దక్కించుకుంది.

ఇక మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టి తొలి మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా కోటి రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..బ్రేక్ ఈవెన్ దక్కించుకోవాలంటే కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిన అవసరం ఉన్న ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే కోటి రూపాయిలు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గరకి రావడం తో ఫుల్ రన్ లో కచ్చితంగా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read:Naga Chaitanya: నా జీవితం లో జరిగే ప్రతి విషయాన్నీ ఆమెతో పంచుకుంటాను – నాగ చైతన్య
[…] Also Read: Happy Birthday Collections: హ్యాపీ బర్త్డే తొలి 3 రోజుల … […]