Prabhas – NTR: టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టార్ర్ర్ సినిమాల హవ్వా గట్టిగా నడుస్తుంది..కలలో కూడా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వదు అనుకుంటున్న వారందరికి దర్శక ధీరుడు రాజమౌళి #RRR సినిమాతో నిజం చేసి దేశ వ్యాప్తంగా మారుమోగిపోయ్యే సెన్సషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..సుమారు 1150 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం అల్ టైం టాప్ 3 ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది..ఇక ఈ క్రేజీ ముల్టీస్టార్ర్ర్ సినిమా ఇచ్చిన ఊపుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా దర్శక నిర్మాతలు ముల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు..అలా త్వరలోనే ఎన్టీఆర్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో ఒక ముల్టీస్టార్ర్ర్ మూవీ తియ్యడానికి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది..క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చెయ్యడం లో ఎప్పుడూ ముందు ఉండే కరణ్ జోహార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకొని రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరికి అందనంత రేంజ్ కి ఎదిగిన ప్రభాస్..ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు..ప్రస్తుతం KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు ప్రభాస్..ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు..మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక #RRR సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నాడో మన అందరికి తెలిసిందే..కొమురం భీం పాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు ఆయన..అలా కెరీర్ పరంగా ఇద్దరు పీక్స్ లో ఉన్న సమయం లో వీళ్ళ కాంబినేషన్ లో ఒక ముల్టీస్టార్ర్ర్ పడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం ఏ రేంజ్ లో షేక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్స్ మీదకి తెచ్చేందుకు కరణ్ జోహార్ సన్నాహాలు చేస్తున్నాడు..మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ..ఈ కాంబినేషన్ కోసం ఇప్పటికే ఇద్దరి హీరోలను కరణ్ జోహార్ కలిసినట్టు తెలుస్తుంది.
Also Read:Pakka Commercial collections: పక్కా కమర్షియల్ 10 రోజుల వసూళ్లు.. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసింది
Recommended Videos




[…] […]
[…] […]
[…] […]