Pakka Commercial collections: గోపీచంద్ హీరో గా క్రేజీ యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..మంచి ట్రైలర్ తో అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా ఆ అంచనాలకు తగట్టు మాత్రం ఎంటర్టైన్మెంట్ పంచలేకపోయింది..కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఏ మాత్రం పేలకపోవడం తోనే సినిమా ఔట్పుట్ అలా వచ్చిందంటూ సినీ విశ్లేషకులు చెప్తున్నారు..దానికి తోడు ఈ సినిమాలోని పాటలు కథకు స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమా ఫలితం తారుమారు అవ్వడానికి ఒక కారణం అయ్యింది..అయితే సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా కలెక్షన్స్ మాత్రం స్టడీ గా ఉండడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోయినప్పటికీ..లాంగ్ రన్ లో సినిమా పర్వాలేదు అనే వసూళ్లను దక్కించుకొని యావరేజి నుండి ఎబోవ్ యావరేజి వైపు పరుగులు తీస్తుంది..కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు..వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ ని రాబట్టింది..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది అనే చెప్పాలి..విడుదల అయ్యి 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసింది..బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఎంత వసూలు చెయ్యాలి అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ ద్వారా నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..అందువల్ల కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా సొంత రిలీజ్ ని దక్కించుకుంది..దానితో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 17 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..అయితే మొదటి రోజు కేవలం 2 కోట్ల 50 లక్షల రూపాయిల ఓపెనింగ్ ని మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా బయ్యర్స్ ని కాస్త టెన్షన్ పెట్టింది..కానీ స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తూ అనూహ్యం గా ఈ సినిమా పది రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ప్రపంచవ్యాప్తంగా డైలీ వచ్చే షేర్స్ ఇప్పట్లో ఆగే ట్రెండ్ కనిపించకపోవడం తో మరో నాలుగు కోట్ల రూపాయిలు ఫుల్ రన్ లో వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..అదే కనుక జరిగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..ఇక ఈ సినిమా OTT రిలీజ్ కూడా 50 రోజుల తర్వాతనే ఉంటుందని మేకర్స్ చెప్పడం తో లాంగ్ రన్ మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది
Also Read: Naga Chaitanya: నా జీవితం లో జరిగే ప్రతి విషయాన్నీ ఆమెతో పంచుకుంటాను – నాగ చైతన్య

Also Read:Pawan Kalyan Chaturmasya Deeksha: పవన్ కళ్యాన్ చాతుర్మాస్య దీక్ష.. అసలేంటిది? ఎందుకు చేస్తారు?
[…] […]
[…] […]