Lavanya Tripathi
Lavanya Tripathi : అందంతో పాటు అద్భుతమైన అభినయం గల హీరోయిన్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి(Lawanya Tripati). తెలుగు అమ్మాయి కాకపోయినా, అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించే రూపం ఆమె సొంతం. అందుకే కెరీర్ లో పెద్దపెద్ద హిట్స్ లేకపోయినా, మన ఆడియన్స్ ఆమెకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇటీవల కాలంలో ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చిన ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ కంటే లావణ్య త్రిపాఠి వెయ్యి రెట్లు మేలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన తోటి హీరోయిన్స్ లాగా అందాల ఆరబోతలు చేయడం లావణ్య త్రిపాఠి కి ఇష్టం ఉండదు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. కొన్ని హిట్ అయ్యాయి కానీ, అత్యధిక శాతం ఫ్లాప్ అయ్యాయి. అది ఆమె దురదృష్టం అనుకోవచ్చు. ఇక వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమించి పెళ్లాడిన తర్వాత సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది.
పెళ్ళికి ముందు ఆమె బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ తో కలిసి ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ చేసింది. కానీ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది మాత్రం గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన మాత్రమే. ఈ వెబ్ సిరీస్ కి అంతంత మాత్రం గానే రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఆమె ఎలాంటి సినిమాలో కానీ, వెబ్ సిరీస్ లో కానీ కనిపించలేదు. దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇప్పుడు ‘సతీ లీలావతి'(Sathi Leelavati) మూవీ షూటింగ్ లో పాల్గొన్నది. నిన్న గాక మొన్ననే పూజ కార్యక్రమాలు మొదలుపెట్టుకున్న ఈ సినిమా అప్పుడే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుందట. దానికి సంబంధించిన ఫోటోని మూవీ టీం ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక నుండి లావణ్య త్రిపాఠి రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా, కేవలం ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తుందట. హీరోల పక్కన డ్యాన్స్ వేసే పాత్రలు మాత్రం చేయదట. ఒకవేళ చేస్తే ఆ చిత్రంలో హీరోగా వరుణ్ తేజ్ ఉంటేనే చేస్తుందట. పెళ్ళైన తర్వాత ఇంత పద్దతిగా ఎంత మంది హీరోయిన్స్ ఉంటారు చెప్పండి?, ఇప్పుడు ఆమె మెగా కోడలు, వాళ్ళు గట్టిగా తల్చుకుంటే పాన్ ఇండియన్ మూవీ లో లావణ్య త్రిపాఠి కి హీరోయిన్ రోల్ ఆఫర్ రాగలదు. కానీ ఆమె ఆ దారిలో వెళ్లడం లేదు. కేవలం పద్దతిగా, తన మనసుకి నచ్చిన పనులను చేసుకుంటూ ముందుకుపోతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో లావణ్య త్రిపాఠి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది.