Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ని పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేదో అని అంతా అనుకున్నారు. కానీ ఆమె పెళ్ళైన కొద్ది నెలలు గ్యాప్ తీసుకొని, ఆ తర్వాత ‘సతీ లీలావతి’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని వచ్చే నెల 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి నుండి లావణ్య త్రిపాఠి కేవలం అందాల ఆరబోతలకు పరిమితమయ్యే హీరోయిన్ పాత్రలు కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. ‘సతీ లీలావతి’ లో కూడా ఆమె అలాంటి పాత్ర చేసిందని అర్థం అవుతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో లావణ్య త్రిపాఠి ఫుల్ బిజీ గా గడుపుతోంది.
ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇప్పటి వరకు ఆమె ఎవరికీ తెలియని ఒక టాప్ సీక్రెట్ ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు, నేను గర్భవతి ని అయ్యాను అనే విషయం తెలిసింది. గర్భం దాల్చిన ఏ స్త్రీ అయిన సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. కానీ షూటింగ్ మొదలై చాలా రోజులైంది. ఇప్పుడు నేను గర్భం దాల్చిన కారణంగా షూటింగ్ ని ఆపేస్తే నిర్మాతకు చాలా నష్టం కలిగించిన దానిని అవుతాను. అందుకే నేను గర్భవతి ని అయినప్పటికీ ఈ షూటింగ్ ని పూర్తి చేశాను. వామిటింగ్స్ అయ్యేవి, అది ఎవరికీ తెలియకుండా చూసుకొని షూటింగ్ లో పాల్గొనే దానిని. పని ఒత్తిడి కారణంగా మైగ్రేన్ వచ్చేది. టాబ్లెట్స్ వేసుకొని షూటింగ్ కి వెళ్లేదానిని’.
‘నేను గర్భం దాల్చిన విషయాన్ని మా మూవీ టీం ఎవ్వరికీ కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్తే వాళ్ళు నన్ను ఎక్కడ స్పెషల్ గా ట్రీట్ చేస్తారో అని భయం ఉండేది. అలా ట్రీట్ చేయడం నాకు ఇష్టం ఉండదు’ అను చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, చాలా శారద వాతావరణం లోనే పూర్తి చేసుకునేలా ప్రతీ ఒక్కరు సహకరించారని, ఈ షూటింగ్ లో గడిపిన సమయం స్వీట్ మెమొరీస్ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. ఆమె మాట్లాడిన ఈ మాటలు చూసి , ఇంత డేడికేటెడ్ హీరోయిన్స్ మన టాలీవుడ్ లో ఉన్నందుకు గర్విస్తున్నాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు.