https://oktelugu.com/

Lavanya Raj Tarun: అతిని మొబైల్ లో నా ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి అంటూ లావణ్య ఆరోపణ..రాజ్ తరుణ్ కేసు లో ఊహించని ట్విస్ట్!

రాజ్ తరుణ్ తో లవ్ బ్రేకప్ అయ్యి లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. అతనితో కూడా విబేధాలు వచ్చి విడిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన లావణ్య, మళ్ళీ రాజ్ తరుణ్ జీవితం లోకి వచ్చి అతన్ని ముప్పుతిప్పలు పెట్టాలని చూసింది అని నెటిజెన్స్ సైతం అర్థం చేసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 12:25 PM IST

    Lavanya Raj Tarun

    Follow us on

    Lavanya Raj Tarun: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో హీరో రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం ఎంత సెన్సేషనల్ టాపిక్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రోజుకి ఒక మలుపు చోటు చేసుకుంటూ, ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్ళిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రస్తుతం ఎంతో హీట్ మీద ఉన్నాయి. అలాగే బాంగ్లాదేశ్ ప్రాంతం లో జరుగుతున్న అల్లర్లు మరో సెన్సేషన్ అయ్యింది. ప్రైమ్ టైం లో న్యూస్ చానెల్స్ ఈ అంశాలను కూడా పక్కన పెట్టి రాజ్ తరుణ్ – లావణ్య పై స్టోరీలను రన్ చేసారంటే, టీఆర్ఫీ లకు ఈ అంశం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తంలో తప్పు లావణ్యదే అని జనాలందరికీ అర్థం అయ్యింది.

    రాజ్ తరుణ్ తో లవ్ బ్రేకప్ అయ్యి లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. అతనితో కూడా విబేధాలు వచ్చి విడిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన లావణ్య, మళ్ళీ రాజ్ తరుణ్ జీవితం లోకి వచ్చి అతన్ని ముప్పుతిప్పలు పెట్టాలని చూసింది అని నెటిజెన్స్ సైతం అర్థం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా మస్తాన్ సాయి ని నిన్న గుంటూరు పోలీసులు డ్రగ్స్ కేసు లో అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా అతన్ని విచారిస్తూ మొబైల్ పరిశీలించగా, ఎంతోమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిపై లావణ్య మాట్లాడుతూ మస్తాన్ సాయి మొబైల్ లో నా ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయి. ఒకరోజు పని మీద అతని ఇంటికి వెళ్ళినప్పుడు రహస్యంగా వీడియో రికార్డు చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోల గురించి రాజ్ తరుణ్ కి కూడా తెలుసు అంటూ లావణ్య ఆరోపించింది. ఇదంతా పక్కన పెడితే అసలు మస్తాన్ సాయి ని కలవాల్సిన అవసరం నీకేంటి?, ప్రైవేట్ వీడియోలు తీసేంత స్టఫ్ అతని ఇంటికి వెళ్లి నువ్వేం చేసావు, అంటే నీకు మస్తాన్ సాయి కి మధ్య రిలేషన్ ఉందని నువ్వే మరోసారి ఒప్పుకున్నావు, ఏ యాంగిల్ లో చూసిన ఆధారాలన్నీ నువ్వే దోషివి అని నిరూపిస్తున్నాయి, రాజ్ తరుణ్ అమాయకుడిలాగా అనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    అసలు డ్రగ్స్ ని అమ్ముతూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ మీడియా ఇంత హంగామా చేస్తుంది, జర్నలిస్ట్ విలువలను రోజురోజుకి కాలరాస్తున్నారు అంటూ స్కిల్ మీడియా నెటిజెన్స్ మీడియా పై మండిపడుతున్నారు. ఇకపోతే రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం రిస్క్ లో పడింది అనే చెప్పాలి. ఈ వివాదం వల్ల ఆయనకీ ఒకప్పుడు ఉన్న కొద్దిపాటి మార్కెట్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. రీసెంట్ గానే వారం రోజుల గ్యాప్ లో ఆయనవి రెండు సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మళ్ళీ రాజ్ తరుణ్ కం బ్యాక్ ఎప్పుడిస్తాడో చూడాలి.