Lava Kusa : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికి కొన్ని సినిమాలు మాత్రం క్లాసికల్ గా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాలను బీట్ చేసే దర్శకులు గానీ నటులు గాని ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సీనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు ఆయన పోషించినటువంటి పౌరాణిక పాత్రలు అతన్ని చాలా ఉన్నత స్థానంలో నిలిపాయి.
ఎన్టీఆర్ లాంటి నటుడు తన కెరియర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాడు స్టార్ హీరోగా ఎదిగాడు…అయినప్పటికి 1963 వ సంవత్సరంలో ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా వచ్చిన ‘లవకుశ’ సినిమా ఆయన కెరియర్ ను మలుపు తిప్పింది. ఎవ్వరు ఊహించనటువంటి గొప్ప విజయాన్ని అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ రాముడిగా అంజలీదేవి సీత గా నటించారు. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయిందని చెప్పాలి. రామాయణంలోని రాముడు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా లవకుశ సినిమాను సి ఎస్ రావు, సి పుల్లయ్య అనే దర్శకులు తెరకెక్కించారు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ప్రేక్షకలోకమంతా ఏకమై ఈ సినిమాని భారీ విజయంగా నిలిపారు. అలాగే ఈ మూవీ ఇప్పటివరకు చాలా సార్లు రీరిలీజ్ కూడా అయింది. ఈ సినిమాను రీరిలీజ్ చేసిన ప్రతిసారి కాసుల వర్షం అయితే కురిపించింది. మరి అలాంటి ఒక గొప్ప సినిమా గురించి ఈ జనరేషన్ లో ఉన్న చాలామందికి తెలియకపోవచ్చు. కానీ లవకుశ అనే సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గానే నిలిచిపోతుంది. ఇలాంటి గొప్ప సినిమాలను ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకు సైతం చూపించి వాళ్లకు నీతి వాక్యాలను బోదిస్తే బాగుంటుంది… ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి ఒక పౌరాణిక గొప్ప చిత్రమైతే రాలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : 500రోజులు ఆడిన ఏకైక మూవీ లవకుశ.. సీనియర్ ఎన్టీఆర్ స్టామినా ఇది..
ఎన్టీఆర్ తన కెరియర్ లో పోషించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో ఈ సినిమాలో తను చేసిన రాముడు పాత్ర మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ మూవీలో ఆయన్ని చూస్తే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర మూర్తిని చూసినట్టే ఉంటుందని ఇప్పటికీ చాలామంది అతన్ని కొనియాడుతూ ఉంటారు.
నిజానికి రాముడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ తెలుగు వాళ్లకు తెలిసిన రాముడు మాత్రం ఎన్టీఆర్ అని చెబుతూ ఉంటారు. ఇక అంతటి ఫాలోయింగ్ రావమే కాకుండా ఆయన నిజ జీవితంలో రాజకీయ ప్రవేశం చేసి సీఎం గా గెలవడానికి కూడా సినిమాలు చాలావరకు హెల్ప్ అయ్యాయి…
ఇక లవకుశ సినిమా సక్సెస్ ఫుల్ గా 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకో 100 సంవత్సరాలు గడిచినా కూడా ఈ సినిమాకి ఉన్న ప్రత్యేకత అలాగే ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్నవారు ఒకసారి ఈ సినిమాను చూస్తే ఆటోమేటిగ్గా వాళ్ళ మూడు చేంజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరైనా ఈ సినిమా చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి…
Also Read : ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భారతరత్న పరిస్థితి ఏమిటి ?