Kalki 2898 AD: మన తెలుగు ప్రేక్షకులు గర్వపడి కాలర్ ఎగరేసే స్థాయిలో ఉన్నటువంటి చిత్రాల లిస్ట్ తీస్తే అందులో ‘కల్కి’ చిత్రం కచ్చితంగా ఉంటుంది. ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ లో కూడా బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య అనేక పాన్ ఇండియన్ సినిమాలకు అవసరం లేకపోయినా సీక్వెల్స్ ని ప్రకటిస్తున్నారు. కానీ కచ్చితంగా సీక్వెల్ కావాలి ప్రతీ ఒక్కరు డిమాండ్ చేయదగ్గ చిత్రం కల్కి మాత్రమే. ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఇది ఒక మల్టీవర్స్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
పార్ట్ 2 లో కల్కి భగవానుడిని మోస్తున్న సుమతి ని హతమార్చేందుకు సుప్రీమ్ యాస్కీన్ భూమి మీదకు రాబోతున్నట్టు చూపిస్తారు మేకర్స్. మహాభారతం లో కర్ణుడి పునర్జన్మ ఎత్తిన భైరవ, అశ్వథామ కలిసి సుప్రీమ్ యాస్కీన్ తో పోరాడి ఓడించి, కల్కి భగవానుడిని భూమి మీదకు ఎలా తీసుకొచ్చారు అనేదే పార్ట్ 2 స్టోరీ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైందని ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘కల్కి పార్ట్ 2 షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ పార్ట్ 1 తీస్తున్న సమయంలోనే పూర్తి చేసాము. కేవలం లీడ్ నటీనటులకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పార్ట్ 2 లో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. అంత అద్భుతంగా ఆ సన్నివేశాలను తెరకెక్కించాడు డైరెక్టర్. అదే విధంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా ఇండియన్ మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. దీపికా పదుకొనే కూడా త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఆమె తన బిడ్డతో ఎక్కువ సమయం గడుపుతుంది. అందుకే మేము కూడా ఆమెని డేట్స్ ఇంకా అడగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అన్ని కుదిరితే ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కనుక జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే రాజాసాబ్ చిత్రం కూడా ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది.