Kho Kho World Cup 2025: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం(Indira Gandhi indoor stadium Delhi) వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు (Indian womens team) ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ఏ మాత్రం ఫాల్స్ కు అవకాశం లేకుండా భారత క్రీడాకారిణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.. నేపాల్ జట్టుకు (Nepal team) కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు కూడా సాగించారు. ఫలితంగా చివరి పోరు టర్న్ -1 కు చేరుకొంది. ఆ సమయంలో భారత ప్లేయర్లు దూకుడు కొనసాగించారు. ఫలితంగా భారత్ ఒకానొక సందర్భంలో 34-0 వద్దకు చేరుకుంది.. అయితే రెండవ టర్న్ లో నేపాల్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడింది.. ఏకంగా 24 పాయింట్లు సాధించడంతో.. మ్యాచ్ మళ్లీ మూడో టర్న్ వైపు వెళ్ళింది.. అయితే మూడవ టర్న్ లో భారత్ మళ్లీ దూకుడు మొదలు పెట్టింది. వరుసగా పాయింట్లను సాధించింది.. ఏకంగా 49 పాయింట్లు లీడ్లోకి వెళ్ళింది. అయితే ఆ టర్న్ లో నేపాల్ 16 పాయింట్లు మాత్రమే సాధించడంతో భారత్ విజయం సాధించింది. మొట్టమొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది.
రెండో టర్న్ లో పడిపోయినప్పటికీ..
మొదటి టర్న్ లో భారత్ ఒక రేంజ్ లో ఆడింది. నేపాల్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధించింది. ఫాల్స్ కు ఏమాత్రం చోటు ఇవ్వలేదు. నేపాల్ ప్లేయర్లు వత్తిడిలో చిత్తయిపోయారు. భారత ఆటగాళ్ల డిఫెన్స్ ముందు తేలిపోయారు. ఈ క్రమంలో వరుసగా పాయింట్లు సమర్పించుకొని దారుణమైన ఓటమి ముందు నిలిచారు. అయితే టర్న్ -1 ముగిసిన తర్వాత.. భారత ప్లేయర్లలో అతి విశ్వాసం అంతకంతకు పెరిగిపోవడంతో.. దానిని నేపాల్ ప్లేయర్లు అందిపుచ్చుకున్నారు. టర్న్ -2 లో తమదైన దూకుడు మొదలుపెట్టారు. భారత ఆటగాళ్ల డిఫెన్స్ ను చేధించుకుంటూ సత్తా చాటారు. ఫలితంగా టర్న్ -2 లో ఏకంగా 24 పాయింట్లు సాధించారు. దీంతో భారత ప్లేయర్లు ఒత్తిడికి గురయ్యారు. ఈ సమయంలో మ్యాచ్ టర్న్ -3 వైపు మళ్లింది. దీంతో ఎలాగైనా మ్యాచ్ దక్కించుకోవాలనే కసి భారత ప్లేయర్లలో కనిపించింది. అందువల్లేవారు టర్న్ -3 లో మళ్లీ దూకుడు మొదలుపెట్టారు. డిఫెన్స్ కు మరింత పదును పెంచారు. ఆటలో సరికొత్త నూతనత్వాన్ని తీసుకొచ్చారు. అందువల్లే నేపాల్ ప్లేయర్లపై పై చేయి సాధించారు. రొటేషన్, డామినేషన్, ఓరియంటేషన్.. ఈ మూడు విధానాలను స్పష్టంగా పాటిస్తూ గెలుపును సొంతం చేసుకున్నారు. ఖో ఖో ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ అభినందనలను సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తున్నారు.