Tamil Bigg Boss : ఇండియాలో సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. అలా కాకుండా టెలివిజన్ రంగానికి కూడా గుర్తింపును తీసుకొచ్చిన షోలలో బిగ్ బాస్ షో ఒకటి…ఈ ప్రోగ్రాం ను అన్ని భాషల్లో కండక్ట్ చేస్తూ ప్రతి భాషలో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఆయా భాషల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారు హిస్టింగ్ చేస్తూ ఈ షోని సక్సెస్ ఫుల్ గా నిలపడానికి వాళ్ళ వంతు కృషి అయితే చేస్తున్నారు…
తెలుగులో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. నిజానికి ఈ షో ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారిన విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా నాగార్జున కూడా తనదైన రీతిలో ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ బిగ్ బాస్ షో ను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో ఆయన కూడా చాలా వరకు కృషి చేశారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్ గా ముగిసింది. ఇక ఈ సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిఖిల్ నిలవగా, గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక ఇదిలా ఉంటే హిందీ బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 18 లో కరణ్ వీర్ మెహ్రా విజేతగా నిలిచాడు.
ఇక సల్మాన్ ఖాన్ అతన్ని విన్నర్ గా ప్రకటించి 50 లక్షలు చెక్కుని కూడా అతనికి అందజేయడం విశేషం…ఇక ఇదిలా ఉంటే విలియమ్ సేన రన్నరప్ గా నిలిచారు. ఇక హిందీ లోనే కాదు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 కూడా నిన్నటితో ముగియడం విశేషం…ఈ షో కి విజయ్ సేతుపతి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇంతకుముందు ఏడు సీజన్లకి కమలహాసన్ హోస్ట్ గా చేసి బిగ్ బాస్ షో కి చాలా మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి సైతం కమల్ హాసన్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ సీజన్ ను చాలా సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేశాడు… ఇక ఈ సీజన్ లోక్ ముత్తు కుమారన్ విన్నర్ గా నిలువగా, సౌందర్య రన్నరప్ గా నిలిచారు. ఇక ఏది ఏమైనా కూడా అన్ని భాషల్లో వస్తున్న బిగ్ బాస్ షో కి చాలా మంచి ఆదరణ దక్కుతూ ఉండడం విశేషం…
ఈ షో సక్సెస్ ను చూసినట్లయితే ఇంకా చాలా సీజన్లు ఈ షో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ విషయంలో యాజమాన్యం కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి సీజన్ కి కొత్తదనాన్ని ఆడ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు.