బన్నీ – సుక్కు ముచ్చట పడి ముస్తాబు జేస్తున్న ‘పుష్ప’ మొదటి పార్ట్ ను అంగరంగవైభవంగా విడుదల చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం మొదటి పాట “దాక్కో దాక్కో మేక”ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అయితే, ఆ పాట మిశ్రమ స్పందనకే పరిమితం అయింది. అందుకే బన్నీ సోషల్ మీడియా టీమ్ యూట్యూబ్ లో వ్యూస్ కోసం బాగా ఖర్చు పెట్టారు.
మొదటి పాటకు వచ్చిన రియాక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని.. మిగిలిన పాటల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రష్మిక మందన్న పై “శ్రీవల్లి” అనే రెండో పాటను అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట అవుట్ ఫుట్ కూడా ఏవరేజ్ గానే ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ లో మునపటి వేడి వాడి కనబడటం లేదు అనే విమర్శలు వస్తోన్న నేపథ్యంలో.. చిత్రబృందం రష్మిక అందాల పై ఎక్కువ శ్రద్ధ పెట్టింది.
పాట పరంగా ఫెయిల్ అయినా.. కనీసం పాటలో రిలీజ్ చేసే విజువల్స్ కోసమైనా ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వాలనే ఆలోచనతో సుక్కు.. ఈ పాటలో రష్మిక అందాల కనువిందు చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా నటిస్తున్న రష్మిక, ఈ సినిమా కోసం ఎక్స్ పోజింగ్ లో పరిధులు దాటింది అట, నిజానికి అమెది పూర్తిగా డీ గ్లామర్ పాత్ర, అయినా పాటల్లో మాత్రం ఫుల్ గ్లామరస్ బ్యూటీగా కనిపించబోతుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే.. ప్రతి నెలా ఒక పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ లో ఒక్క సాంగ్ ను కూడా విడుదల చేయలేదు. మరోపక్క డిసెంబర్ 17న ‘పుష్ప’ మొదటి పార్ట్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మళ్ళీ ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్.
అయితే, ’అలా వైకుంఠపురంలో’ సినిమా బన్నీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. “పుష్ప” పాటలను ఇంత త్వరగా రిలీజ్ చేస్తున్నారు అంటే.. కారణం ‘అలా వైకుంఠపురంలో’ సినిమానే. ఆ సినిమా పాటల ప్రమోషన్ ని ఐదు నెలల ముందే మొదలు పెట్టారు. దాంతో ఆ సాంగ్స్ జనంలోకి బాగా వెళ్లాయి. అందుకే ‘అలా వైకుంఠపురంలో’ ఫార్ములానే పుష్పకు కూడా ఫాలో అవ్వాలని బన్నీ ఫిక్స్ అయ్యాడు.
