Rajamouli-Mahesh movie : బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే ప్రతి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఘనవిజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని చెప్పడం తప్ప ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. అధికారికంగా సినిమా యూనిట్ కూడా ఈ సినిమా గురించి చెప్పట్లేదు. ఇక సినిమా ఓపెనింగ్ కూడా ఇటీవలే సీక్రెట్ గా చేశారు. ఈ ఓపెనింగ్ కు సంబంధించి ఒక ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రానివ్వలేదు. దీంతో మహేష్ బాబు SSMB29 సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ రావడంలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ లీకుల ద్వారా మాత్రం ఈ సినిమా నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగు ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి హైదరాబాదులో వేసిన సెట్టులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇక గతంలో రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని కొన్ని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ కు రావడంతో రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్తలకు బలం చేకూరింది.
ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో హీరో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా పాల్గొన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా తో పాటు హాలీవుడ్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అయితే హైదరాబాదులో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం.
అయితే ఇటీవలే దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం కెన్యాలో లొకేషన్స్ వెతుకుతున్నట్టు ఒక పోస్ట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రోజురోజుకు ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా పూర్తి అవడానికి కనీసం మూడేళ్లు అయినా పడుతుందని వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమా నుంచి ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా ద్వారా రాజమౌళిని వేడుకుంటున్నారు. ఇక తాజాగా హీరో మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ సక్సెస్ మీట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి