Homeఎంటర్టైన్మెంట్Kalki 2898 AD: కల్కి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్... ఆ...

Kalki 2898 AD: కల్కి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్… ఆ విషయంలో టెన్షన్ ఫ్రీ!

Kalki 2898 AD: కల్కి 2829 AD ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. కెరీర్లో ఫస్ట్ టైం ఈ జోనర్ ట్రై చేస్తున్నారు. కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే చెప్పినట్లు కల్కి విడుదలయ్యే అవకాశం లేదనేది ఇండస్ట్రీ టాక్. కల్కి చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కల్కి మే నెలలో విడుదల కావడం సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి . అయితే లేటెస్ట్ అప్డేట్ ఈ అనుమానాలు పటాపంచలు చేసింది. కల్కి షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ తన పార్ట్ పూర్తి చేశారట. కేవలం కొంత ప్యాచప్ షాట్స్ ఉన్నాయట. మార్చి చివరి కల్లా ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందట. మొత్తంగా చిత్రీకరణ చివరి దశలో ఉందని సమాచారం. అయితే సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే విజువల్ ఎఫెక్ట్స్ ,గ్రాఫిక్స్ కి నెలల తరబడి సమయం కేటాయించాల్సి వస్తుంది. మరో నెలన్నర సమయం మాత్రమే ఉండగా… పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందా అనేది మరొక సందేహం. అయితే మూవీ చిత్రీకరణ జరుగుతుండగానే… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.

ఏకంగా మూడు ప్రాంతాల్లో ప్రముఖ సంస్థలు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేస్తున్నాయట. కాబట్టి సమ్మర్ కి కల్కి విడుదల అవడం అనివార్యమే అంటున్నారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు. సాహో నుండి సలార్ వరకు ప్రభాస్ మూవీ చెప్పిన తేదీకి వచ్చిన దాఖలు లేవు. ప్రతిసారి పోస్ట్ ఫోన్ అవుతూ ఉంటాయి. కల్కి కూడా ఒకసారి వాయిదా పడింది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అలా జరగలేదు. సమ్మర్ కి వాయిదా పడింది.

దీంతో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కానీ కల్కి చెప్పిన తేదీకే వస్తుందని తాజా సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ కీలక రోల్స్ చేస్తున్నారు. అశ్వినీ దత్ దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కల్కి కి సీక్వెల్ ఉంటుందని సమాచారం. పార్ట్ 2లో కమల్ హాసన్ రోల్ చాలా కీలకంగా ఉంటుందట.

RELATED ARTICLES

Most Popular