Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. ఈ నెల 11న రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్‌గా డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది.

ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే. మొత్తానికి యువ హీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ అంటూ ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అయింది. ఇక ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అంచనాలను పెంచగా.. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
Also Read: ఏయే తేదీల్లో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుందో తెలుసా?
ఈ సినిమా ప్రమోషన్స్ తో రవితేజ బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫుల్ కిక్కు అనే సాంగ్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కూడా ఈ సాంగ్ ను ఫుల్ గా షేర్ అండ్ లైక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిజంగానే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు ఎక్కించింది. సినీప్రియులకు ఫుల్ కిక్ అందించింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా బలంగా ఉంటుందట.

కాగా ఈ సినిమాలో నాజర్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు అని టాక్ ఉంది. మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోవడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది.
Also Read: ‘చొప్ప దండి’ రివ్యూ: వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
[…] Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు..! భగత్‌సింగ్’ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి త్వరలోనే ఓ అప్డేట్ ఇస్తానని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పాడు. ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. […]