Rupali Ganguly: చాలా మంది యువతులు హీరోయిన్స్ కావాలని అనుకోవడం మనం చూడొచ్చు. హీరోయిన్ కావడం ద్వారా తమకు ఫుల్ పాపులారిటీ వస్తుందని భావిస్తుంటారు. అదే విధంగా రెమ్యునరేషన్ కూడా బాగా ఉంటుందని అనుకుంటారు.కాగా, సీరియల్ లో నటించి హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారూ ఉన్నారు. అలా సీరియల్స్ లో నటించిన యాక్ట్రెస్ ..సినిమా స్టార్స్ కంటే కూడా ఎక్కువనే సంపాదిస్తున్నారు. అలా సీరియల్స్ లోని నటిస్తూ దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాక్ట్రెస్ ఎవరో తెలుసుకుందాం.

సీరియల్స్ లో నటిస్తే పెద్దగా పేరు రాదని అనుకుంటారు మెజారిటీ ప్రజలు.కానీ, సీరియల్స్ తోనూ చాలా మంది పాపులర్ అయ్యారు. హిందీ సీరియల్స్ లో నటించి కొందరు నటీమణులు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. వారు తీసుకుంటున్న రెమ్యునరేషన్ చూసి స్టార్ హీరోయిన్సే ముక్కున వేలేసుకుంటున్నారు. అలా ఇండియాలో ఒక్క రోజుకు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ యాక్ట్రెస్ రూపాలీ గంగూలీ.
Also Read: ‘చొప్ప దండి’ రివ్యూ: వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
ఈమె టీవీ స్క్రీన్ పైన కనబడితే చాలు రేటింగ్స్ వచ్చేస్తాయి. నార్త్ లో ఫుల్ పాపులర్ అయిన ఈమెకు రెమ్యునరేషన్ విషయంతో తగ్గేదేలే అంటుంది. ‘అనుపమ’ అనే టీవీ డ్రామాతో ఈమె దేశంలోనే ఫేమస్ అయింది. ఈ డ్రామ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ మె ఒక కాల్ షీట్ కు అనగా 9 హవర్స్ కు ఏకంగా రూ.4 లక్షలు డిమాండ్ చేస్తుంది. ఈమె ఏజ్ 44 ఇయర్స్. కాగా, ఈమె పాపులారిటీ చూసి మిగతా ఇండస్ట్రీ సీరియల్ నటీ , నటులు సినీ హీరో, హీరోయిన్సే షాక్ అవుతారు.
అలా ఈమె టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీ మణిగా గుర్తింపు పొందింది. ‘అనుపమ’టీవీ డ్రామాకు రేటింగ్స్ కూడా భారీగానే ఉంటాయి. ఈ డ్రామా స్టోరి విషయానికొస్తే.. భర్త వివాహేతర సంబంధం కారణంగా గృహిణి చితికిపోతుంది. ఆ నేపథ్యంలో ఎలా గృహిణి తన ఇల్లును ఎలా చక్కబెట్టుకుంటుంది? కథనంలో మార్పులు, ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సీరియల్ సాగుతోంది. టీవీ నటిగా రూపాలీ గంగూలీ హీరోయిన్స్ కంటే ఎక్కువ గుర్తింపు పొందింది. ఈమె గతంలో పలు చిత్రాలలో నటించింది. అలా గతంలో వెండితెరపై సందడి చేసిన గంగూలీ…ఇప్పుడు బుల్లితెరపై అలరిస్తోంది.

ఆమెకు ఉన్న క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఒక్క మాట మాట్లాడకుండా అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఒక్క సీరియల్‌తోనే వచ్చిన క్రేజ్ కాదిది.. ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలోనే ఉండి ఇది సంపాదించుకుంది రూపాలి. అందుకే ఈమెకు అంత పాపులారిటీ ఉంది. ఈమె తర్వాత రామ్ కపూర్ లాంటి వాళ్లు కూడా రోజుకు 3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి రూపాలీ గంగూలీ నటనతోనే కాదు.. పారితోషికంతో కూడా రప్ఫాడిస్తుంది. తెలుగు పాపులర్ సీరియల్ ‘కార్తీక దీపం’ ఫేమ్ ‘వంటలక్క’ అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ రోజుకు రూ.75 వేల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం.
Also Read:ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు.. చేస్తే అరిష్టమే!