Movie Release Dates: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో, టాలీవుడ్‌లో విడుదల తేదీల కోలాహలం మొదలైంది. వరుసపెట్టి చిత్ర నిర్మాతలు తమ చిత్ర విడుదల తేదీలను ప్రకటిస్తుండగా, ఈ ఏడాది మంచి వినోదభరిత చిత్రంగా ఆసక్తి కలిగిస్తున్న ఎఫ్3 కూడా తేదీని ఫిక్స్ చేసుకుంది. అయితే వరుణ్ తేజ్, వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రం ఆచార్యకు ఒకరోజు ముందుగా, అంటే ఏప్రిల్ 28న థియేటర్లలో రాబోతోంది.

మొత్తానికి పెదనాన్నకు పోటీగా అబ్బాయి దిగబోతున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్లను బేరాలు లేకుండా వేలం పాట పాడుకోనున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మండు వేసవిలో ఫుల్ కలెక్షన్లు చూపెట్టేందుకు సిద్దమయ్యారు. మే 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ కూడా విడుదల కాబోతుండగా, ఇంతకాలం అప్‌డేట్స్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: ఐకార్ లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఉద్యోగాలకు ఎవరు అర్హులంటే?

భీమ్లా నాయక్ డేట్ కూడా వచ్చేసింది. మొదటినుండీ అభిమానులకు థియేటర్ ఎక్స్‌పీరియన్సే ఇవ్వాలని కోరుకున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈక్రమంలో ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న కచ్చితంగా థియేటర్లలోనే కలుస్తామని పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫైనల్‌గా ఆచార్య ఏప్రిల్ 1 నుండి 29కి జరగడంతో ఆ డేట్‌లో భీమ్లా వచ్చే అవకాశాలున్నాయి.

అయితే, ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌తో రాజమౌళి మళ్లీ పలు సినిమాల విడుదల తేదీలను మార్చేశాడు. ఇలా ఆర్ఆర్ఆర్ డేట్ అనౌన్స్ అయిందో లేదో పలు బడా సినిమాలు తమ డేట్స్‌ను మార్చాల్సి వచ్చింది.
Also Read: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!