https://oktelugu.com/

Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?

Union Budget Of India 2022: కేంద్ర వార్షిక బడ్జెట్ నేడు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దీనిపై అంద‌రికి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఏఏ రంగాల‌ను ప‌ట్టించుకుంటారు? ఏ అంశాల‌ను ప‌ట్టించుకోరు? అనే వాటిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. రెండేళ్లుగా క‌రోనాతో స‌హ‌వాసం చేస్తున్న సంద‌ర్భంలో కేంద్రం ఏం చ‌ర్య‌లు తీసుకుంటుంది? సామాన్యుడికి ఏం ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తుంది? పేద‌వారి కోసం ఏం ప‌థ‌కాలు తీసుకొస్తుంద‌నే ఆశ‌లో ఉన్నారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వంపై పెద్ద బాధ్య‌త ఉంద‌ని తెలుస్తోంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2022 / 11:04 AM IST
    Follow us on

    Union Budget Of India 2022: కేంద్ర వార్షిక బడ్జెట్ నేడు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దీనిపై అంద‌రికి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఏఏ రంగాల‌ను ప‌ట్టించుకుంటారు? ఏ అంశాల‌ను ప‌ట్టించుకోరు? అనే వాటిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. రెండేళ్లుగా క‌రోనాతో స‌హ‌వాసం చేస్తున్న సంద‌ర్భంలో కేంద్రం ఏం చ‌ర్య‌లు తీసుకుంటుంది? సామాన్యుడికి ఏం ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తుంది? పేద‌వారి కోసం ఏం ప‌థ‌కాలు తీసుకొస్తుంద‌నే ఆశ‌లో ఉన్నారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వంపై పెద్ద బాధ్య‌త ఉంద‌ని తెలుస్తోంది. రాష్ట్రాల ప్ర‌యోజ‌నాలు కాపాడే క్ర‌మంలో బడ్జెట్ లో ఏ ర‌క‌మైన ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న ఉంటుంద‌నే విష‌యాల‌పై ప్ర‌జ‌ల్లో ఉత్కంఠ నెల‌కొంది.

    Union Budget Of India 2022

    మ‌రోవైపు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వాటిని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఏ ప‌థ‌కాలు తీసుకొస్తుందోన‌ని ఎదురుచూస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్, ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నిక‌లు ఈ నెల నుంచి జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో బీజేపీ ఇక్క‌డ గెల‌వాల‌నే ఉద్దేశంతో భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఏర్ప‌డింది. దీంతో ఓట‌ర్లు కూడా ఉత్సాహంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే దిశ‌గా స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే త‌మ రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

    క‌రోనా ప్ర‌భావంతో రెండేళ్లుగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుదేల‌వుతున్నాయి. వ్య‌వ‌స్థ‌ల‌న్ని దెబ్బ తిన్నాయి. దీంతో ప్ర‌భుత్వంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌ను ఆదుకోవాల‌ని సామాన్యుడి నుంచి పేద‌వాడి వ‌ర‌కు అంద‌రు ఆశిస్తున్నారు. కేంద్రం త‌మ కోసం ప‌థ‌కాలు కేటాయిస్తుంద‌ని ఎదురు చూస్తున్నారు. దీంతో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రూపొందించిన బ‌డ్జెట్ లో ఎవ‌రికి ప్రాధాన్యం ఇస్తారో? ఎవ‌రిని ప‌ట్టించుకోరో అర్థం కావ‌డం లేదు. మొత్తానికి ఆర్థిక బడ్జెట్ మీద అంద‌రికి గురి మాత్రం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

    Nirmala Sitharaman

    Also Read: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?

    పెరిగిన ఖ‌ర్చుల నేప‌థ్యంలో ఆదాయ‌పు పన్నులో మిన‌హాయింపులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో రూ.1.50 లక్ష‌లుగా ఉన్న దాన్ని ప్ర‌స్తుతం రూ.3 ల‌క్ష‌ల‌కు పెంచేందుకు స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని భావిస్తున్నారు. సెక్ష‌న్ 80 సీలో నిబంధ‌న‌లు స‌డ‌లించి ఈ మార్పులు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల‌తో సామాన్యుడికి మేలు జ‌ర‌గాల‌నే ఉద్దేశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని కోసం కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆశ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ పై అంద‌రిలో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం ఏం నిర్ణ‌యాలు తీసుకుంటుందో అనే ఆలోచ‌న వ‌స్తోంది.

    Also Read: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!

    నేడు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ పై సామాన్యుడి నుంచి సంప‌న్నుడి దాకా ఆశ‌లు పెట్టుకున్నారు. బ‌డ్జెట్ రూపొందించడంలో ఏం ప్రాతిప‌దిక తీసుకున్నారో అని చూస్తున్నారు. ఏఏ రంగాల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఏం ప‌థ‌కాలు తీసుకొచ్చారో అనే దానిపై ఆశ‌లు పెట్టుకున్నారు. ద్విచ‌క్ర వాహ‌నాల‌పై జీఎస్టీ త‌గ్గించార‌నే వార్త‌లు వ‌స్తున్నా అవి కొనే వారికే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది త‌ప్ప మిగ‌తా వారికి పెద్ద‌గా లాభం ఉండ‌దు. మొత్తం అస్ర్తం అంతా నిర్మ‌లా సీతారామ‌న్ చేతిలో ఉంది. బడ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో ఆమె మంత్రం వేశారో కానీ కొద్ది సేప‌టి త‌రువాత తెలుస్తుంది.

    Tags