Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: ‘పార్థు’గా మహేష్ బాబు.. ముహూర్తం ఘనంగా ముగిసింది !

Mahesh Babu: ‘పార్థు’గా మహేష్ బాబు.. ముహూర్తం ఘనంగా ముగిసింది !

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తొలి పూజా కార్యక్రమం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా మొదలైంది. ముహూర్తపు షాట్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా టైటిల్‌ గా ఓ ఇంట్రెస్టింగ్ నేమ్ వినిపిస్తోంది. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో గతంలో అతడు, ఖలేజా […]

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తొలి పూజా కార్యక్రమం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా మొదలైంది. ముహూర్తపు షాట్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా టైటిల్‌ గా ఓ ఇంట్రెస్టింగ్ నేమ్ వినిపిస్తోంది.

Mahesh Babu
Mahesh Babu

మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ఈ సినిమా టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేశ్‌బాబు కొత్త మూవీ టైటిల్ ‘పార్థు’ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి మహేష్ సిస్టర్ గా నటించబోతుందట.

Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్

ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. సహజంగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు కచ్చితంగా ఓ భారీ ఫైట్ ను డిజైన్ చేస్తాడు. గమనిస్తే.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక ఫైట్ సీన్ ఉంటుంది.

పైగా ఆ సీన్స్ అన్నీ ట్రాఫిక్ తో పాటు చిన్నపాటి గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఇదే తరహా ఫైట్ ను ప్లాన్ చేశాడు. మార్చి 7వ తేదీ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ పై త్రివిక్రమ్ ఆ ఫైట్ నే షూట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నారు కాబట్టి.. ఈ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ ను తీసుకుంటున్నారు.

Mahesh Babu
Mahesh Babu

దాంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే రెండింతలు పెరిగింది. మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. సినిమాలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట.

అదేవిధంగా ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా రాబోతుంది.

Also Read: వరుణ్ తేజ్’తో పెళ్లి పై లావణ్య క్లారిటీ.. మరి వరుణ్ మాటేమిటి ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper