https://oktelugu.com/

Varun Tej: వరుణ్ తేజ్’తో పెళ్లి పై లావణ్య క్లారిటీ.. మరి వరుణ్ మాటేమిటి ?

Varun Tej: మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఏమిటి ? త్వ‌ర‌లో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోవడం ఏమిటి ? అంటూ మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. కానీ, ఈ పుకార్లు మాత్రం వైరల్ అయ్యాయి. మరోపక్క, అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందని సినీ ప్రముఖులు కూడా చాలా ఉత్సాహంగా ఎంక్వైరీ చేశారు. ఇంతకీ వరుణ్ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి అట. అయితే, తాజాగా వరుణ్ తేజ్ తో […]

Written By:
  • Shiva
  • , Updated On : February 3, 2022 / 12:18 PM IST
    Follow us on

    Varun Tej: మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఏమిటి ? త్వ‌ర‌లో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోవడం ఏమిటి ? అంటూ మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. కానీ, ఈ పుకార్లు మాత్రం వైరల్ అయ్యాయి. మరోపక్క, అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందని సినీ ప్రముఖులు కూడా చాలా ఉత్సాహంగా ఎంక్వైరీ చేశారు. ఇంతకీ వరుణ్ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి అట. అయితే, తాజాగా వరుణ్ తేజ్ తో తన పెళ్లి పై ఈ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది.

    Varun Tej

    వరుణ్‌ తేజ్ తో తన పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్‌ విని ముందు లావణ్య షాక్ అయిందట. కాగా తాజాగా లావణ్య ఇన్‌‌ స్టాలో ఫ్యాన్స్‌ తో ముచ్చటించింది. వరుణ్‌ తో పెళ్లి పై ఓ నెటిజన్ ప్రశ్నించగా, ‘నా పెళ్లి ఎవరితో అనేది నాకే తెలియదు. మరి ఇతరులకు ఎలా తెలుస్తుందో’ అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. అంతలో ‘మీరు ఎవరితోనూ ప్రేమలో లేరా? అని మరో వ్యక్తి అడగ్గా, ఆమె ఆ విషయంలో స్పందించలేదు.

    Also Read:  సినిమాల్లోకి వెళ్ళు బావ.. అంతే, ఆమె మెడలో తాళి కట్టాడు !

    మొత్తానికి వరుణ్‌ తేజ్‌ తో పెళ్లిపై లావణ్య క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ, అతనితో ప్రేమలో ఉందో లేదో అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, మరోపక్క లావణ్యతో వరుణ్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, ఆమె వరుణ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జరుగుతూనే ఉంది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే.. వరుణ్ టెక్ లైవ్ లోకి వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలి.

    Lavanya Tripathi

    అసలు ఈ ప్రచారానికి కారణం ఏమిటి అంటే.. ?

    గత ఏడాది ‘మే’లో వరుణ్ – లావణ్య కలిసి ఓ హాలీడే ట్రిప్‌ కి వెళ్లారు. అప్పటి నుంచి ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడిచింది. దీనికి తోడు ఆ తర్వాత వ‌రుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావ‌ణ్య క‌నిపించింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే నిహారిక పెళ్లికి వెళ్ళింది. అలాంటిది మరి, లావణ్య ఎలా వెళ్ళింది ? అంటూ అప్పుడే రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

    మొత్తమ్మీద ఆ పుకార్లకు తాజాగా వీరి ప్రవర్తన మరింత ఊత‌మిచ్చిన‌ట్లైంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వ‌దంతులు బాగా వినిపిస్తున్నాయి. ఇక వ‌రుణ్‌ తేజ్, లావ‌ణ్య ఇద్ద‌రూ ‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ వంటి సినిమాల్లో కలిసి న‌టించారు. ఆ సినిమాల స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ల‌వ్‌లో ప‌డ్డార‌ట. ఆ అట అనేది లేకుండా రాకుండా ఉండాలి అంటే.. వరుణ్ స్పందిచాల్సిందే.

    Also Read: రవితేజకి అత్తగా అనసూయ.. ఆ మందు తాగే సీన్ లో.. ?

    Tags