Jaganmohini: ప్రస్తుతం గ్రాఫిక్స్, విజ్యువల్ ఎఫెక్ట్స్ .. సినిమా మేకింగ్ లో కీలకంగా మారాయి. ఆధునికమైన సాంకేతికత వలన మూవీ మేకింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ బాగా పెరిగిపోయాయి కూడా. కాగా, అప్పట్లో అయితే అటువంటి పరిస్థితులు లేవు. ఆనాటి కాలంలో అనగా 1970 , 80 లలో దర్శకులు, డీఓపీలు కెమెరా టెక్నిక్స్ ఉపయోగించి తాము అనుకున్నది వెండితెరపైన ఆవిష్కరించేవారు. అలా వెండితెరపైన విజ్యువల్ వండర్ గా ఆవిష్కృతమైన చిత్రం ‘జగన్మోహిని’. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న కథ తెలుసుకుందాం.
దయ్యాలు ప్రథాన కథాంశంగా తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్స్ అయ్యాయి. కాగా, వాటిని సరిగా డీల్ చేయగలిగే దర్శకత్వ ప్రతిభ దర్శకుడి వద్ద ఉండాలి. అలా దర్శకుడు ఎక్సలెంట్ గా డీల్ చేసిన సినిమానే ‘జగన్మోహిని’. ఈ చిత్రం జానపద కథాంశమని అందరూ భావించారు. కాగా, ఇందులో ఎవరూ ఊహించని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెట్టేసి దర్శకుడు చాలా చక్కగా సినిమాను ఆవిష్కరించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అవడమే కాదు. తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా బాగా సక్సెస్ అయింది.
Also Read: మేడారం జాతరకు సెలవులు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటో?
జాన పద బ్రహ్మగా పేరు గాంచిన విఠలాచార్య ఈ చిత్రంలో కెమెరా టెక్నిక్స్ ఉపయోగించి దయ్యాలను సృష్టించాడు. పాము, గద్ద, ఇతర జంతువులను క్రియేట్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. నరసింహరాజు, జయమాలని, ప్రభ హీరో హీరోయిన్లుగా నటించారు. నరసింహరాజు తల్లిగా ‘మహానటి’ సావిత్రి నటించింది. ఈ చిత్రం చేయడానికి ముందర విఠలాచార్య తీసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టగా ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు విఠలాచార్య.
ఇక అప్పటి వరకు ఫామ్ లో ఉన్న హీరో నరసింహరాజు కెరీర్ కు ‘జగన్మోహిని’ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది. ఈ చిత్రం విడుదలయ్యేనాటికి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ బీట్ చేసి ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రం అత్యద్భుతమైన ఆవిష్కరణ అని దివంగత కమెడియన్ పొట్టి వీరయ్య, తదితర సినీ ప్రముఖులు అంటుంటారు. ఇప్పటి డిజిటల్ టెక్నాలజీ వరల్డ్ తో పోలిస్తే అప్పట్లో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని వివరిస్తారు.
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Latest telugu movie news did you know that the movie that created the devil with camera tricks back then
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com