Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు..! భగత్‌సింగ్’ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి త్వరలోనే ఓ అప్డేట్ ఇస్తానని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పాడు. ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలంటూ అభిమానులు హరీశ్‌శంకర్‌ని కోరడంతో ఆయన ఇలా పాడ్‌కాస్ట్ ద్వారా స్పందించాడు మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అన్నట్టు పవన్ మరోసారి మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వెంకటేశ్తో ‘గోపాల గోపాల’, రానాతో ‘భీమ్లా నాయక్’ చేశారు. ఇప్పుడు తన ఫ్యామిలీలో హీరో, మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి తెర పంచుకునేందుకు సిద్ధమయ్యారు.
తమిళంలో గతేడాది ఓటీటీలో విడుదలైన ‘వినోదయ సితమ్’ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఆయనే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.మరి తన మేనల్లుడితో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేస్తే.. నిజంగానే అదిరిపోతోంది. ఏది ఏమైనా పవన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాను త్వరత్వరగా పూర్తి చేశాడు.
Also Read: గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. ఆ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయట!

పైగా పవన్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కూడాను. అదే విధంగా హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేంధర్ రెడ్డి చిత్రం ఇలా పవన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే వచ్చే ఎన్నికల కోసం కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నాడు.
Also Read: ప్రభుత్వ భూముల తాకట్టు.. అప్పులు రాబట్టు