DJ Tillu: ‘డీజే టిల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినీ జర్నలిస్టు సురేష్ కొండేటి వెకిలి ప్రశ్నలు అంటూ మీడియాలో సురేష్ కొండేటి పై విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏమి జరిగింది ? నిజంగానే సురేష్ కొండేటి ఇలాంటి నీచమైన కామెంట్లు చేశాడా ? అసలు సురేష్ కొండేటి సినీ జర్నలిస్టు కాదా ?, ముందుగా సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న దగ్గరకు వద్దాం.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సురేష్ కొండేటి, హీరో సిద్ధుతో మాట్లాడుతూ.. ‘మీరు హీరోయిన్ నేహా శెట్టి శరీరంపై పుట్టుమచ్చలను రియల్‌గా లెక్కపెట్టారా? అంటూ ఒక దిగువస్థాయి ప్రశ్నకు తెగ తెలివి ప్రదర్శిస్తూ అడిగాడు. సురేష్ కొండేటి ఇలా హీరో సిద్ధును ప్రశ్నించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు సురేష్ కొండేటి సినీ జర్నలిస్టు కూడా కాదు అంటూ అతని పై విరుచుకుపడుతున్నారు.
Also Read: సూపర్ స్టార్ ను దాటేసిన ఐకాన్ స్టార్ !
దీని పై హీరోయిన్ నేహా కూడా స్పందిస్తూ.. ‘ఈ ప్రశ్న చాలా దురదృష్టకరం. దీన్నిబట్టి అతను తనచుట్టూ పనిచేసే మహిళలను, ఇంట్లో స్త్రీలను ఎంత గౌరవిస్తున్నాడో అర్థమైపోతుంది’ అంటూ ట్వీట్ చేసింది. అయినా హీరోయిన్ పుట్టుమచ్చలు లెక్కపెట్టడం ఏమిటి సురేష్ కొండేటి ? నీకు ఇండస్ట్రీలో ఒక గౌరవం ఉంది. ఇప్పుడు ఆ గౌరవం పోయింది. అసలు ఏమయ్యా.. హీరోయిన్ పుట్టుమచ్చలు నీకెందుయ్యా ?

ఇన్నాళ్లు ఎంతో కష్టపడి సాధించుకున్న గౌరవాన్ని ఇలాంటి కామెంట్లతో పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయమే. ఏమి చేస్తాం.. కాలం కలిసి రాకపోతే.. రూపాయి లాభం లేకుండానే జీవిత కాలం పరువును పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా సురేష్ కొండేటి,ఇలాంటి వాటికీ దూరంగా ఉండాలని ఉంటాడని ఆశిద్దాం.
Also Read: డిటర్జెంట్, గంజి పొడితో పాల తయారీ.. కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలంటే?