Mahesh Babu: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను వదిలారు. అన్ స్టాపబుల్’ షో నుంచి వచ్చిన ఈ స్పెషల్ ప్రోమోలో బాలయ్య, మహేశ్ సరదాగా మాట్లాడుకున్నారు. పెళ్లి గురించి బాలయ్య ప్రశ్న అడగ్గానే సూపర్ స్టార్ సిగ్గుపడ్డాడు.

మరి మహేష్ తన పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ? అనేది ఈ ఫుల్ ఎపిసోడ్ చూస్తే గాని అర్ధం కాదు. అన్నట్టు ఈ షో ఈ రోజు రాత్రి 8 గంటలకు ‘ఆహా’లో ప్రసారం కానుంది. మొత్తానికి బాలయ్య ప్రశ్నలకు మహేశ్ బాబు సిగ్గుపడుతూ సమాధానాలు చెప్పాడట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పై నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
సహజంగా బాలయ్య, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది.. తన బాలయ్య పేస్ బుక్ లో మహేష్ గురించి రీసెంట్ గా కామెంట్ పెడుతూ.. ‘అద్భుతమైన నటుడు.. అంతకన్న అద్భుతమైన మనసు ఉన్న మనిషి మన సూపర్ స్టార్ మహేష్’ అని బాలయ్య పోస్ట్ చేసాడు. మొత్తానికి బాలయ్యను కూడా మహేష్ ఆకట్టుకున్నాడు.

ఇక రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ లో బాలయ్య కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తాయట. ఇప్పటికే 9 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మొత్తానికి గ్రాండ్ ఫినాలేకి రెడీ అయింది. అన్‌స్టాపబుబ్ సీజన్ ముగింపు వేడుకగా ఈ ఎపిసోడ్ తో ముగుస్తోంది.
Also Read: డిటర్జెంట్, గంజి పొడితో పాల తయారీ.. కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలంటే?
[…] Ap Employees vs Jagan: ఏపీ సీఎం జగన్ ను బాగా దగ్గరి నుంచి చూసిన వారు ‘మొండివాడు’ అని అంటారు. తండ్రి వైఎస్ఆర్ చనిపోతే ఓదార్పు కోసం ఏకంగా అప్పటి దేశంలోనే బలమైన నాయకురాలు సోనియాగాంధీని ఎదురించి మరీ జైలుకు వెళ్లాడు జగన్. 16 నెలలు జైలు జీవితం గడిపినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఏకంగా రాష్ట్ర సీఎం అయ్యారు. ఇంకొకరు అయితే ఈ కష్టాలెందుకని రాజకీయాలను వదిలేసేవారే. కానీ అక్కడున్నది జగన్. అయితే జగన్ పట్టుదలతో సీఎం అయ్యారు. ప్రస్తుతం మొండిxe పరిపాలిస్తున్నారు. ఈ పాలన రెండున్నరేళ్లలో ఎన్నో సమస్యలు. అన్నింటిని అంతే దూకుడుగా.. ధైర్యంగా మొండిగా ఢీ అంటే ఢీ అనేలా జగన్ ఎదుర్కొంటున్నాడు. […]
[…] Shocking News: సెలబ్రిటీల విడాకుల వార్తలు చాలా కామన్ అయిపోయాయి. బాలీవుడ్ లో ఇది ఓల్డ్ ట్రెండ్ కాగా.. సౌత్ లో కూడా ఊపందుకుంటుంది. నెలల వ్యవధిలో ఇద్దరు సౌత్ స్టార్స్ విడాకుల ప్రకటన చేశారు. సమంత-నాగ చైతన్యల విడాకులు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్ నాలుగేళ్ల సంసారం తర్వాత గుడ్ బై చెప్పుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న విడాకుల ప్రకటన చేశారు. సమంత, చైతూ విడాకుల వార్త సద్దుమణగక ముందే మరో స్టార్ డివోర్స్ ప్రకటించారు. […]