K.G.F Chapter 2: ‘కేజీఎఫ్ 2’.. యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా సినిమా. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ మూవీ షోలేలోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను ఈ సినిమా కోసం రీమేక్స్ చేశారని. ఈ పాటలో యంగ్ బ్యూటీ అనన్య పాండే నటించింది అని తెలుస్తుంది. అయితే, ఈ పాట కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితమా ? లేక, అన్ని భాషల్లో ఉంటుందా ? అనేది చూడాలి.

అన్నట్టు ఈ సినిమా గురించి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందట. ఆమెది స్పై లాంటి పాత్ర. ఇక దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: అనుపమ కడుపు చూసి షాక్ అయిన కమెడియన్ !
దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు. అన్నట్టు కెజిఎఫ్ 2 గత ఏడాది అక్టోబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ వలన షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆలస్యం అవ్వడం, ఆ తరువాత ఈ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తే.. కరోనా సెకెండ్ వేవ్ వచ్చి రిలీజ్ ను మళ్ళీ ఆపడంతో.. మొత్తానికి ఈ సినిమా దాదాపు రెండేళ్లు నుండి వాయిదా పడుతూనే వస్తోంది.

కానీ సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. యష్ ని ఎదుర్కొనే విలన్ గా ఈ బాలీవుడ్ నటుడు ఎలా ఉంటాడో చూడాలి. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి.
ఇక ఫస్ట్ పార్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన తమన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించబోతుందట.
Also Read: బాలయ్య రచ్చ.. 3 సినిమాలు ఫిక్స్.. 5 సినిమాలు వెయిటింగ్ !