Tollywood: తెలుగు సినిమాకు మళ్లీ గ్రహణం పట్టింది. టాలీవుడ్ సాలిడ్ హిట్ చూసి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఒకపక్క వారాలు వెళ్లిపోతున్నాయి. సినిమాలు కూడా అలా వచ్చి ఇలా వెళ్తున్నాయి. కొన్ని సినిమాలకు పోస్టర్ డబ్బులు కూడా రావడం లేదు. ట్రైలర్ తో కాస్త అంచనాలు తెచ్చుకున్న సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ శుక్రవారం కూడా పేరుకు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
కానీ ఆ నాలుగు సినిమాలకు కనీస కలెక్షన్స్ కూడా రావడం లేదు. రిలీజ్ కి ముందు పుష్షక విమానం సినిమాకు మంచి హైప్ వచ్చింది. విజయ్ దేవరకొండ వైల్డ్ గా ప్రమోషన్స్ చేసాడు. సినిమాకి కూడా ఏవరేజ్ టాక్ వచ్చింది. కట్ చేస్తే.. సినిమా నష్టాల్లో నడుస్తోంది. ఇక కురుప్ (డబ్బింగ్) అంటూ వచ్చిన ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది.

కానీ, ఓపెనింగ్స్ కరువు అయ్యాయి. ఇక మిగిలిన రెండు సినిమాలు ‘రాజా విక్రమార్క, తెలంగాణ దేవుడు’.. ఈ సినిమాల కలెక్షన్స్ గురించి ముచ్చటించుకుని ఆ సినిమాలను అవమానించడం భావ్యం కాదు కాబట్టి.. ఆ సినిమాల పరిస్థితి గురించి ఒక్క మాటలో ముగిద్దాం. నిత్యం ప్రేక్షకులతో రద్దీగా ఉండే కమర్షియల్ థియేటర్ లో కూడా ఈ సినిమాలకు పది టికెట్లకు మించి తెగ లేదు.

మొత్తానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ భారీ ప్లాప్స్ గా నిలిచాయి. నిజానికి కురుప్ సినిమా బాగానే ఉందంటూ మంచి రివ్యూలు వచ్చాయి. అయితే, ఆ రివ్యూలు కూడా ఆ సినిమాను కాపాడలేకపోయాయి. ఆ సినిమాకి ప్రేక్షకులు కరువయ్యారు. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తిగా ఉన్నారా ?
లేక, ఓటీటీల మత్తులోనే ఉండిపోతారా ? ప్రతి సినిమా వాడికి ఉన్న భయం ఇది. ఇలాగే ప్రతి వారం జరిగితే థియేటర్లు కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. అసలు సరైన సినిమా పడకపోవడంవల్లే.. ఈ పరిస్థితి. మరి రానున్న రోజుల్లో భారీ సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. తెలుగు బాక్సాఫీస్ కి మళ్ళీ ఊపు వస్తోందేమో చూడాలి.
Also Read: మహేష్ సినిమాలో కూడా అదే ఫైట్ !