OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో పాటు ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు… ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

OTT Releases: ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో లేవు. లో బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆడియన్స్ ఎక్కువగా ఒటిటి వైపే మొగ్గు చూపుతున్నారు.

Written By: S Reddy, Updated On : June 11, 2024 10:12 am

Latest OTT releases this week

Follow us on

OTT Releases: ఈ వారం ఓటీటీలో కొన్ని క్రేజీ మూవీస్ అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక థియేటర్లలో సినిమాల సందడి మొదలైంది. ఈ వారం పలు చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న హరోం హర, యేవమ్, మ్యూజిక్ షాక్ మూర్తి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న సూపర్ హిట్ మూవీస్ ఓటీటీలో సందడి చేయనున్నాయి.

ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో లేవు. లో బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆడియన్స్ ఎక్కువగా ఒటిటి వైపే మొగ్గు చూపుతున్నారు. వైవిధ్యమైన సినిమాలు, కొత్త వెబ్ సిరీస్ లు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఓటీటీ లవర్స్ కోసం ఈ వారం 20కి పైగా క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సైతం ఉంది.

మే 31న విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పటు ఓటీటీలో ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు ఏమిటో చూద్దాం..

ఆహా
పారిజాత పర్వం – తెలుగు సినిమా – జూన్ 12,
కురంగు పెడల్ – తమిళ్ డబ్బింగ్ సిరీస్ – జూన్ 14

డిస్ని ప్లస్ హాట్ స్టార్

ప్రొటెక్టింగ్ ప్యారడైజ్- ఇంగ్లీష్ మూవీ – జూన్ 10
ది కలర్ ఆఫ్ విక్టరీ- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 10
నాట్ డెడ్ యెట్ సీజన్ 2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 12

నెట్ ఫ్లిక్స్
టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 – ఫ్రెంచ్ వెబ్ సిరీస్ – జూన్ 11
కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ది గోల్డెన్ టచ్ సీజన్ 2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 12
మై నెక్స్ట్ గిఫ్ట్ సీజన్ 5 -ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 12
మిస్టీరియర్స్ ఆఫ్ ది టెర్రాకోటా వారియర్స్ – ఇంగ్లీష్ సినిమా – జూన్ 12
బిడ్జర్ట్న్ సీజన్ 3 పార్ట్ 2 -ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 13
డాక్టర్ క్లైమాక్స్ – థాయ్ వెబ్ సిరీస్ – జూన్ 13
అబంగ్ ఆధిక్ – మాండరిన్ సినిమా – జూన్ 14
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – తెలుగు సినిమా – జూన్ 14
జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ -ఇండోనేషియన్ వెబ్ సిరీస్ – జూన్ 14
మహారాజ్ – హిందీ సినిమా – జూన్ 14

అమెజాన్ ప్రైమ్

గ్రౌండ్ -తెలుగు సినిమా – జూన్ 10
ద బాయ్స్ సీజన్ 4 – జూన్ 13

ఆపిల్ ప్లస్
ప్రోజుమెడ్ ఇన్నోసెంట్ – జూన్ 12
క్యాంప్ స్నూపీ – జూన్ 14

జీ 5

లవ్ కి ఎరేంజ్ మ్యారేజ్- హిందీ సినిమా – జూన్ 14,
పరువు -తెలుగు సిరీస్ – జూన్ 14