Bheemla Nayak Release Date: ‘అయ్యయ్యో.. భీమ్లా నాయక్ ఎంత పని జరిగి పోయినాదయ్యా. ఎంత పని జరిగిపోయినాదయ్యా’ అని అనుకొంటూ వణుకుతున్న చేతులతో పవన్ అభిమానులు కన్నీళ్లు తుడుచుకుంటున్నారట. ఇలా పవన్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పై సెటైర్లు వేస్తున్నారు. ఉన్నట్టు ఉండి.. ఈ గోల ఏమిటయ్యా ? అని ఆరా తీస్తే.. భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో పవన్ యాంటీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ప్రపంచంలోకి కొత్త వైరస్ వచ్చేసింది. దేశంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అందుకే.. నిన్నటి నుంచి మూడో వేవ్ వార్తలకు మళ్ళీ గిరాకీ పెరిగింది. చిన్న వార్త కనిపించినా దాన్ని నెటిజన్లు వైరల్ చేసి పారేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ సినిమాల బతుకు ఓటీటీ పాలు కాక తప్పదు అంటూ పుకార్లు మొదలైయ్యాయి.
ఆ పుకార్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తూ అన్నీ ఏరియాల్లో అలుముకుంటూ ముందుకు పోతున్నాయి. కాబట్టి.. ఈ స్థితిలో ముందుగా భీమ్లా నాయక్ పై పడ్డారు పవన్ యాంటీ ఫ్యాన్స్. మూడో వేవ్ కారణంగా మా ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాం అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది అంటూ సోషల్ మీడియాలో ఈ రోజు ఓ వార్త తెగ హల్ చల్ చేసింది.
అయితే, ఈ వార్త విన్న భీమ్లా నాయక్ చిత్రబృందం షాక్ కి గురి అయింది. అసలు ఇలాంటి వార్త ఎలా వచ్చింది ? ఎవరు పుట్టించారు ? అంటూ సతమతమవుతుంది. అందుకే హుటాహుటిన మీడియా గ్రూప్స్ లో ఓ నోట్ ను వదిలారు. భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ అనే వార్తలో ఎలాంటి నిజం లేదు అని, ఇది కేవలం కొందరు కావాలని పుట్టించిన వార్త అని చెప్పుకొచ్చారు.
Also Read: భీమ్లా నాయక్ సినిమా నుంచి గుడ్ న్యూస్… నాలుగవ పాట విడుదల ఎప్పుడంటే ?
కావున, ఆ వార్తను దయచేసి ఎవరూ నమ్మకండి అంటూ యూనిట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇంతకీ భీమ్లా నాయక్ ఓటీటీకి పోవాల్సిన అవసరం ఏముంది ? సంక్రాంతి రేసులో బలంగా వస్తుంటే.. అయితే, సంక్రాంతికి భీమ్లా నాయక్ ను రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తోంది.
భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ అయితే, ఎక్కువగా నష్టపోయేది రాధేశ్యామ్ నిర్మాతలే. అలాగే ఆర్ఆర్ఆర్ కు వచ్చే లాంగ్ రన్ రెవెన్యూ కూడా కొంతవరకు దెబ్బ తింటుంది. మరి, భీమ్లా నాయక్ మొండిగా ముందుకు పోతాడా ? దయతలచి వెనక్కి వెళ్తాడా ? చూడాలి.
Also Read: పవన్ ఆవేశానికి పెద్దల సంకెళ్లు… కారణం అదేనా?