https://oktelugu.com/

Rakul Preeth SIngh: ఒక్క నైట్ లో జాతకం మారిపోతుందని చెప్తున్న రకుల్ ప్రీత్ సింగ్…

Rakul Preet Singh :వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. లౌక్యం, బ్రూస్ లీ, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ధృవ, మన్మధుడు2 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 03:21 PM IST
    Follow us on

    Rakul Preet Singh :వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. లౌక్యం, బ్రూస్ లీ, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ధృవ, మన్మధుడు2 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.

    Rakul Preeth SIngh

    Also Read: ‘పూజా హెగ్డే’ బికినీనే నమ్ముకుంటున్న త్రివిక్రమ్ !

    అయితే ఇటీవల రకుల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రం “థాంక్స్ గాడ్”. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు తో బిజీ అయ్యారు ఈ అమ్మడు. అందులో భాగంగా మీ ఎదుగుదలకు కారణం ప్లానింగేనా అని అడిగితే… గెలవడానికి ఎవరికైనా ప్రణాళికలు అత్యవసరం. కానీ చిత్రసీమలో ప్లానింగ్‌ తో పనులు జరగవు మనం ఒకటి అనుకుంటే, మరోటి జరుగుతుంటుంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు, ఒక్క నైట్ లో జాతకం మారిపోతుంది అని చెప్పింది. ఫిల్మ్ ఇండస్ట్రిలో సర్‌ప్రైజ్‌లు ఎక్కువ అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతుంటాయి.

    కాబట్టి ఏదేదో ఊహించుకోవడం, దానికి తగ్గట్టుగా పనిచేయడం కుదరని పని. నిజానికి మన ఊహకు అందని ఫలితాలు రావడం కూడా ఒక్కోసారి థ్రిల్‌ కలిగిస్తుంటుంది అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రాకుల్ ప్రీత్ సింగ్ రన్‌వే 34, డాక్టర్ జీ, ఇండియన్ 2 తదితర చిత్రాల్లో బిజీగా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాకుల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Also Read: ఆ విషయంలో మీడియాకి సారీ చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌…