https://oktelugu.com/

Mahesh Babu: అందరూ సంతోషమే.. ఒక్క మహేష్ అభిమానులు తప్ప !

Mahesh Babu: అందరి హీరోల అభిమానులందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క మహేష్ బాబు అభిమానులు తప్ప. తెలుగు అగ్ర హీరోలంతా తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటే.. మహేష్ మాత్రం ఏ అప్ డేట్ ఇవ్వలేక ఫ్యాన్స్ ను తెగ బాధ పెడుతున్నాడు. సంక్రాంతికి తన ‘సర్కారు వారి పాట’ రాబోతుంది అంటూ అందరి కంటే ముందు ఎనౌన్స్ చేశాడు. కానీ, తీరా సంక్రాంతికి […]

Written By:
  • Shiva
  • , Updated On : November 30, 2021 / 05:02 PM IST
    Follow us on

    Mahesh Babu: అందరి హీరోల అభిమానులందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క మహేష్ బాబు అభిమానులు తప్ప. తెలుగు అగ్ర హీరోలంతా తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటే.. మహేష్ మాత్రం ఏ అప్ డేట్ ఇవ్వలేక ఫ్యాన్స్ ను తెగ బాధ పెడుతున్నాడు. సంక్రాంతికి తన ‘సర్కారు వారి పాట’ రాబోతుంది అంటూ అందరి కంటే ముందు ఎనౌన్స్ చేశాడు.

    Mahesh Babu

    కానీ, తీరా సంక్రాంతికి అందరి సినిమాలు వస్తున్నాయి గానీ, మహేష్ సినిమా మాత్రం రావడం లేదు. సినిమా ఎలాగూ రిలీజ్ చేయడం లేదు.. కనీసం సాంగ్స్, పోస్టర్స్ లాంటి వాటితోనైనా హంగామా సృష్టించొచ్చుగా అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ లెక్కలు మాట్లాడుతున్నారు. అయితే, “సర్కార్ వారి పాట” సంగతులు ఇప్పుడే చెప్పడం మొదలు పెడితే.. రేపు సినిమా రిలీజ్ అయ్యే నాటికీ ఏ సంగతి మిగలదు అని దర్శక నిర్మాతల అభిప్రాయం.

    కాబట్టి.. మహేష్ అభిమానులు ఇంకా కొన్ని రోజులు పాటు.. అనగా కరెక్ట్ గా మరో రెండు నెలలు పాటు నిరీక్షిస్తూనే ఉండాలి. ఇదే మహేష్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. ఒకపక్క నందమూరి ఫ్యాన్స్ ‘అఖండ’తో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. మరోపక్క బన్నీ ఫ్యాన్స్ సైతం ‘పుష్ప’తో ఘాడమైన లవ్ లో పడిపోయి ఊహల్లో తేలుతున్నారు.

    Also Read: Rakul Preeth Singh: ఒక్క నైట్ లో జాతకం మారిపోతుందని చెప్తున్న రకుల్ ప్రీత్ సింగ్…

    ఇక నందమూరి మెగా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’తో సాధారణ ప్రేక్షకులు, మరియు సగటు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్ళు ఆర్ఆర్ఆర్ తప్ప మరో హీరో గురించి, మరో సినిమా గురించి పట్టించుకునే స్థితిలో లేరు. ఇంకోపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా “రాధే శ్యామ్” అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

    ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా ‘ఆచార్య’ అంటూ కాలక్షేపం చేస్తున్నారు. అక్కినేని అభిమానులకు ‘బంగార్రాజు’ రూపంలో ఓ సరదా ఉంది. అలాగే డిఫరెంట్ సినిమా లవర్స్ ను విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ అలరిస్తోంది. ఎటొచ్చి ఒక్క మహేష్ ఫ్యాన్స్ మాత్రమే నిరుత్సాహంతో ఉన్నారు అన్నమాట. .

    Also Read: Bheemla Nayak Release Date: ‘అయ్యయ్యో.. భీమ్లా నాయకా ఎంత పని జరిగి పోయినాది ?

    Tags