Balakrishna: అనిల్​ రావిపూడి- బాలయ్య కాంబోలో ఫుల్​ కామెడీ.. అంతే డోస్​తో యాక్షన్​ సీన్స్​?

Balakrishna: ప్రముఖ దర్శకుడు అనిల్​ రావిపూడి వరుస సినిమాలతో సక్సెస్​లు అందుకుని.. ప్రస్తుతం ఫుల్​ ఫామ్​లో ఉన్నాడు. ఇదే ఊపుతో.. బాలయ్యతో కలిసి ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజాకార్యక్రమాలతో షూటింగ్​ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా  ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్​డేట్ తెలిసింది. ఈ సినిమాలో కామెడీ డోస్​ బాగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, సినిమా పూర్తి ఎంటర్​టైనర్​ ఉన్నప్పటికీ.. బాలయ్య మేనరిజమ్​కు తగ్గట్లు సీరియస్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 29, 2021 10:48 am
Follow us on

Balakrishna: ప్రముఖ దర్శకుడు అనిల్​ రావిపూడి వరుస సినిమాలతో సక్సెస్​లు అందుకుని.. ప్రస్తుతం ఫుల్​ ఫామ్​లో ఉన్నాడు. ఇదే ఊపుతో.. బాలయ్యతో కలిసి ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజాకార్యక్రమాలతో షూటింగ్​ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా  ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్​డేట్ తెలిసింది. ఈ సినిమాలో కామెడీ డోస్​ బాగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, సినిమా పూర్తి ఎంటర్​టైనర్​ ఉన్నప్పటికీ.. బాలయ్య మేనరిజమ్​కు తగ్గట్లు సీరియస్ యాక్షన్​ డ్రామాను కూడా చూపించనున్నట్లు సమాచారం.

ఇందులో బాలయ్యను సరికొత్త లుక్​లో అనిల్ చూపించనున్నారట. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా స్క్రిప్ట్​ వర్క్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది జులై నుంచి రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించాలని రావిపూడి ప్లాన్​ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తనదైన మార్క్​తో వరుస విజయాలను అందుకుంటూ.. టాలీవుడ్​లో తనకుంటూ ఓ ప్రత్యేక డిమాండ్​ను క్రియేట్​ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.

ఇప్పటికే సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్​ హిట్​ కొట్టాడు. కాగా, ప్రస్తుతం ఎఫ్​2 సీక్వెల్ ఎఫ్​3 సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో తీసే చిత్రం కూడా హిట్​ అయితే.. అనిల్ ను ఆపడం ఎవ్వరి తరం కాదు. మరోవైపు, బాలయ్య అఖండ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కూడా కంప్లీట్​ చేసుకున్న ఈ సినిమా.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.