Bigg Boss 5 Telugu Anchor Ravi: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో ఉన్న యాంకర్ రవి అనూహ్యంగా నిన్నరాత్రి ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. అతడు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని ఫ్యాన్ అనుకున్నారు. ప్రతీసారి ఓటింగ్ లోనూ టాప్ లోనే ఉండేవాడు. శుక్రవారం వరకూ టాప్ 3లో ఉన్నాడు. అతడే బలమైన కంటెస్టెంట్ అని హోస్ మేట్స్ కూడా అనుకున్నారు.కానీ నిన్న రాత్రి రవి ఎలిమినేట్ అయ్యాడని తేలడంతో అభిమానులు షాక్ అయ్యారు.
యాంకర్ రవి ఎలిమినేషన్ అన్యాయం అంటూ తాజాగా ఆయన అభిమానులు రోడ్డెక్కారు. రవి కంటే వీక్ కంటెస్టెంట్స్ కాజల్, ప్రియాంకసింగ్ ఉండగా.. మంచి గేమ్ ఆడుతున్న రవిని బయటకు పంపించడం దారుణం అంటూ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.
బిగ్ బాస్ నిర్వహిస్తున్న హోస్ట్ నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయటే నిలబడి నానా యాగా చేస్తున్నారు. రవి ఎలిమినేట్ కావడం ఏంటని.. ఆయన కంటే బలహీనమైన కంటెస్టెంట్లు ఇంట్లో ఉండగా రవిని కావాలనే చీట్ చేసి బయటకు పంపించారని అతడి అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి ఓట్ల లెక్క తీయండి.. అప్పుడు మీ బండారం అంతా బయటపడుతుంది అని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ టైటిల్ మా క్యాస్ట్ వాడే కొట్టాలి… అరె ఎటు పోతుందిరా ఈ సమాజం!
ఈసారి బిగ్ బాస్ విన్నర్ రవి అవుతాడని ముందు నుంచి అంచనాలున్నాయి. కొన్ని వారాలుగా రవి గ్రాఫ్ పెరిగింది. పైగా ప్రతీవారం నామినేషన్స్ నుంచి బయటకు వస్తూ మరింత స్ట్రాంగ్ అవుతున్నాడు రవి. ఎక్కువగా నామినేట్ అయ్యి విజయవంతంగా బయటపడ్డాడు. ఓట్ల పరంగా రవికి తిరుగులేదు. సపరేట్ ఇండస్ట్రీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఇంత భారీ అభిమానగణం ఉన్నా రవిని బిగ్ బాస్ టీం ఎందుకు ఎలిమినేట్ చేశారన్నది అంతుబట్టకుండా ఉంది.
రవిని కావాలనే బయటకు పంపించి ఉండాలి. లేదంటే నిజంగానే రవికి ఓట్లు తక్కువ పడి ఉండాలి. కానీ ఓట్లు తక్కువ పడే చాన్స్ లేదు. ఎందుకంటే రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్ లకు తక్కువ ఓట్లు పడ్డాయంటున్నారు. ప్రియాంక ఎలిమినేట్ కావాల్సిన పర్సన్ అంటున్నారు. అసలు ఆమే ఏం ఆడడం లేదంటున్నారు. రవి ఎలిమినేట్ అన్యాయం అని ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. మరి ఈ గందరగోళాన్ని బిగ్ బాస్ టీం ఎలా పరిష్కరిస్తుంది? ఎలా తమ విశ్వసనీయతను నిరూపించుకుంటుందన్నది వేచిచూడాలి.
Also Read: మన్మధరాజాలకే బిగ్ బాస్ టైటిలా? ఇదేం లాజిక్ రా బాబు!