JR NTR-Sameera Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా రంగంలో ఎన్టీరామారావు వేసిన భీజంతో ఆయన వారుసులు ఎందరో సినీ రంగానికి వచ్చారు. కానీ కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో హరికృష్ణ, బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు ఉన్నారు. వీరిలో టాప్ హీరోలుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు స్టార్ డమ్ తెచ్చుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగానే ఎంట్రీ ఇచ్చినా ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా మారారు. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ‘అశోక్’, ‘నరసింహుడు’ సినిమాలు ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇందులో ఎన్టీఆర్ పక్కన నటించిన హీరోయిన్ సమీరా రెడ్డి మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సినిమాల తరువాత ఎన్టీఆర్, సమీరారెడ్డిని పెళ్లి చేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం జరిగిందేమిటంటే..?
Also Read: Bimbisara Movie: నందమూరి కళ్యాణ్ రామ్ “బింబిసారా” సినిమా టీజర్ విడుదల…
సమీరా రెడ్డి తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోల పక్కన నటించింది. మెగాస్టార్ చిరంజీవితోనూ ‘జై చిరంజీవ’ సినిమాలో అలరించింది. అయితే ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఆ పరిచయంతో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీలో అడుగుపెట్టాలని ఎంతో ఆశపడిందని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ ఆ తరువాత తేలిన విషయమేంటంటే… ఎన్టీఆర్, సమీరారెడ్డి మంచి స్నేహితులుగా విడిపోయారు. వీరిద్దరి మనసుల్లో ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదట. అందుకే ఆ ప్రస్తావన రాలేదని కొందరు సమాధానం ఇచ్చారు.

Also Read: Balayya: బాలయ్య అన్‌స్టాపబుల్ తర్వాత గెస్ట్‌గా బ్రహ్మి డార్లింగ్?
అయితే ఆ తరువాత సమీరారెడ్డి తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ఆమె తమిళంలో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ తరువాత సౌత్ సినిమాల్లో కనిపించలేదు. హిందీలో ‘మేనే దిల్ తుజ్ కో దియా’ అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. కొన్నాళ్ల తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో సమీరా రెడ్డి అక్షయ్ వర్దన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆకట్టుకునే పోస్టులు పెడుతూ కనిపిస్తోంది. అటు ఎన్టీఆర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తరువాత కూడా రెండు సినిమాలను లైన్లో పెట్టారు.