https://oktelugu.com/

Bheemla Nayak: దీపావళి పండుగ ముందే వచ్చేసిందంటున్న పవన్… “లాలా భీమ్లా ” సాంగ్ వీడియో ప్రోమో ఔట్ …

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర  దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 07:58 PM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర  దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి అభిమానులకు దీపావళి గిఫ్ట్ ఇచ్చేసింది.

    ముందుగా ప్రకటించిన విధంగా సౌండ్‌ ఆఫ్‌ భ్లీమా పేరుతో లాలా వీడియో ప్రోమోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రోమో పవన్ కళ్యాణ్ అభిమానులకు దీపావళిని ముందుగానే తెచ్చిందని చెప్పాలి. లుంగీ లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ గా ఉన్నారని చెప్పాలి. నాగరాజు గారు… దీపావళి మీకు ముందుగానే వచ్చేసిందంటూ పవన్‌ చెప్పే డైలాగ్‌ ఈ ప్రోమోకు హైలెట్‌ గా నిలిచింది. అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ రేంజ్ లో ఇచ్చారు అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

    కాగా ఈ లాలా సాంగ్‌ ఫుల్‌ వీడియో నవంబర్‌ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్  నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.