Lakshmi Manchu: గడ్డకట్టే మంచు నీటిలో బికినీతో మంచులక్ష్మీ జలకాలాట.. వైరల్ వీడియో

మంచు లక్ష్మీ మాట్లాడే ఇంగ్లీష్ పదాలపై కూడా రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి. ఆమె కొందరు ఫాలో అవుతుండగా మరి కొందరు ఇమిటేట్ చేస్తుంటారు...ఇటీవలే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ పలు వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Written By: Neelambaram, Updated On : December 18, 2023 1:33 pm
Follow us on

Lakshmi Manchu: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ తనదైన శైలితో పేరుగాంచిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా యాంకర్ గా, నిర్మాతగానూ ప్రేక్షకులను ఆలరించారు. విభిన్నమైన కథలతో పలు సినిమాల్లో నటించారు. తనదైన వాగ్ధాటితో చెరగని ముద్ర వేసుకున్నారనడంలోనూ ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. నటిగానే కాకుండా టీవీ షోలు కూడా చేస్తున్న మంచు లక్ష్మీ ఓ సందర్బంలో మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ ను ఎంజాయ్ చేస్తానని చెప్పారని తెలుస్తోంది. అలాగే తన మీద ట్రోల్స్ వచ్చిన ఎప్పుడూ మంచు లక్ష్మీ వైరల్ అవుతూనే ఉంటారు.. సినిమాలే కాకుండా మంచులక్ష్మీ బిజినెస్ లోనూ రాణిస్తుండటం విశేషం.

మంచు లక్ష్మీ మాట్లాడే ఇంగ్లీష్ పదాలపై కూడా రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి. ఆమె కొందరు ఫాలో అవుతుండగా మరి కొందరు ఇమిటేట్ చేస్తుంటారు…ఇటీవలే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ పలు వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు.

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ ఓ వీడియోను షేర్ చేశారు. గడ్డకట్టే చల్లని నీటిలో ముునుగుతూ ఉన్న వీడియోలో ఆమె మోనోకినిలో కనిపించారు. అయితే ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు దాన్ని బికినీ అనుకుని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మంచు లక్ష్మీ తాను షేర్ చేసిన వీడియోకి క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే నెటిజన్లు, అభిమానులు రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.