Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: మంచు లక్ష్మి అభిమాని చేసిన పనికి అందరూ షాక్... రేయ్ ఏం జరుగుతుందిరా,...

Manchu Lakshmi: మంచు లక్ష్మి అభిమాని చేసిన పనికి అందరూ షాక్… రేయ్ ఏం జరుగుతుందిరా, ట్రోల్స్ షురూ!

Manchu Lakshmi: అభిమానం కూడా భయపెడుతుంది. ఒక్కోసారి అభిమానులు వేదికల మీదికి పరుగున వస్తారు. ఫోటో దిగేందుకు ప్రయత్నం చేస్తారు. పబ్లిక్ లో కూడా అభిమానులు హీరోల మీదకు దూసుకు వస్తారు. ఈ క్రమంలో హీరోలకు గాయలయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే స్టార్స్ బలమైన సెక్యూరిటీని మైంటైన్ చేస్తారు. దిట్టంగా ఉండే బౌన్సర్లు హీరోలకు కాపలాగా ఉంటారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఒక్కోసారి ఫ్యాన్స్ ని ఆపడం సాధ్యం కాదు. పలు సందర్భాల్లో హీరోల వద్దకు ఫ్యాన్స్ చొచ్చుకువచ్చారు.

స్టార్ హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఇలా జరిగితే అది పెద్ద సంచలనం కాదు. అందరూ అంగీకరిస్తారు. ఫేమ్ లేని చిన్న చిన్న నటుల కోసం అభిమానులు అలా పరుగున వస్తే… సందేహం కలగక మానదు. ఇదేదో సెటప్ అని జనాలు ట్రోల్ చేస్తారు. మంచు లక్ష్మి విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఆమె లేటెస్ట్ మూవీ ఆదిపర్వం. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. మంచు లక్ష్మి వేదిక మీద మాట్లాడుతుండగా అభిమాని ఆమె వద్దకు పరుగున వెళ్ళాడు.

మంచు లక్ష్మి షాక్ తో వెనక్కి జరిగింది. అతడు నేరుగా మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డాడు. అంతలో సెక్యూరిటీ వచ్చి అతన్ని పట్టుకున్నారు. అనంతరం మంచు లక్ష్మి అతనితో ఫోటో దిగింది. సదరు అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి సినిమాలు చేయడం మానేయాలని కాళ్ళ మీద పడి వేడుకున్నాడని ఒకరు కామెంట్ చేయగా, మీరు డబ్బింగ్ చెప్పించుకోండి. సొంత వాయిస్ వాడకండి అని చెప్పడానికి ఆ పని చేశాడని మరొక కౌంటర్ వేశాడు.

అసలు మంచు లక్ష్మిని ఇంతగా అభిమానించే వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది. ఆదిపర్వం సినిమాకు ప్రచారం కల్పించుకోవడం కోసం కూడా ఇలాంటి ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవం ఏదైనా కానీ… ఆదిపర్వం చిత్రానికి ఈ సంఘటన కారణంగా ప్రచారం దక్కింది. కాగా ఇటీవల మంచు లక్ష్మి ముంబైకి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఆమె అక్కడే ఉంటున్నారు. బాలీవుడ్ లో సక్సెస్ కావాలి అనేది ఆమె కోరిక అట.

Exit mobile version