cigarettes : బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం.. ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రతి సినిమా ముందు యాడ్ వస్తుంటుంది. అయినా కూడా వినరే జనాలు. మరణించిన.. పొగాకు దహించి వేసినా.. తాగడం మరవము అన్నట్టుగా తయారవుతున్నారు యువత. రోజు రోజుకు దేశవ్యాప్తంగా సిగరెట్ కాల్చేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. చెప్తే వినకపోతే చెడంగ చూడాలి అంటారు పెద్దలు. ఇక ఎంత మంది చెప్పినా, ఎవరు చెప్పినా వినకుండా సిగరెట్ పీలుస్తూ.. సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారట.
భారతదేశంలో సిగిరేట్ పీల్చేవారి సంఖ్య సుమారు 26 కోట్లు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. ఒక సిగరెట్ తాగితే ఆ వ్యక్తి జీవితంలో 11 నిమిషాలు తగ్గుతాయట. దీని వల్ల త్వరగా చనిపోతారు. మరో అధ్యయనం ప్రకారం.. 30 సంవత్సరాల వ్యక్తి సిగరెట్లు తాగితే.. మరో 35 సంవత్సరాలు మాత్రమే బతుకుతారట.అంటే ఆయుష్షును చేతులారా తగ్గించుకున్నట్టే.
అదే ధూమపానం చేయని వ్యక్తి మరో 53 సంవత్సరాలు బతుకుతాడట. అంటే 35 సంవత్సరాల పాటు సిగరెట్లు తాగిన వ్యక్తి 18 సంవత్సరాల ఆయుష్షును కోల్పోతారు అన్నమాట. ఇదంత ఒకవైపు అయితే సిగిరేట్ ఫిల్టర్లను దేనితో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇందులో సెల్యూలోజ్ అసిటేట్ కోర్ ఉంటుంది. దీని మీద రెండు పొరల రేయాన్ ర్యాప్ ఉంటుంది.
ఫిల్టర్ ప్రధాన భాగమే.. సెల్యూలోజ్ అసిటేట్ ఫైబర్. అంటే ఒక ఫిల్టర్ లో 12,000 ఫైబర్స్ ఉంటాయట. అంతేకాదు కాల్షియం కార్బోనేట్ ను కాగితం పైన పూస్తారట. ఎంత డేంజర్ పదార్థాన్ని మీరు పీలుస్తున్నారో అర్థం అయిందా? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే సిగరెట్ ను మానేయండి.