https://oktelugu.com/

Laila OTT: నెల రోజులు గడవక ముందే ఓటీటీలో లైలా.. వివాదాలు రాజేసిన విశ్వక్ సేన్ మూవీ స్ట్రీమింగ్ డిటైల్స్

లైలా మూవీలో అమ్మాయి పాత్ర చేసి ఆశ్చర్యపడిచాడు హీరో విశ్వక్ సేన్. కామెడీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన లైలా నెల రోజులు గడవక ముందే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అనేక వివాదాలు రాజేసిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డిటైల్స్ చూద్దాం..

Written By: , Updated On : March 5, 2025 / 08:56 AM IST
Laila OTT

Laila OTT

Follow us on

Laila OTT: గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పర్లేదు అనిపించుకున్న విశ్వక్ సేన్ కి మెకానిక్ రాకీ రూపంలో డిజాస్టర్ పడింది. ఇక లైలా మూవీతో ఆయన సరికొత్త ప్రయోగం చేశాడు. లైలా చిత్రంలో అమ్మాయిగా నటించి మెప్పించే సాహసం చేశాడు. ఫెయిల్ లుక్ గయ్ అయిన విశ్వక్ సేన్ కి లేడీ గెటప్ బాగా సూట్ అయ్యింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. అయితే మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. మూవీలో అసలు మేటర్ లేదని ఆడియన్స్ తేల్చేశారు. విశ్వక్ సేన్ కెరీర్లో డిజాస్టర్ మూవీగా లైలా నిలిచింది.

Also Read: సింగర్ కల్పనా కి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.. ఆమె బతుకంతా విషాదం!

లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు కాగా.. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. కామెడీ, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన లైలా నిరాశపరిచిన నేపథ్యంలో విడుదలై నాలుగు వారాలు గడవక ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న లైలా విడుదలైంది. కాగా లైలా మూవీ డిజిటల్ రైట్స్ ఆహా సొంతం చేసుకుంది. మార్చి 7 నుండి ఆహాలో లైలా స్ట్రీమ్ కానుందని సమాచారం. లైలా చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

లైలా మూవీ కథ విషయానికి వస్తే .. మోడల్ అయిన సోనూ(విశ్వక్ సేన్)కి హైదరాబాద్ పాత బస్తీలో ఒక పార్లర్ ఉంటుంది. ఆ ఏరియా జనాలకు అతడు ఫేవరేట్ మేకప్ మ్యాన్. జిమ్ ట్రైనర్ జెన్నీని(ఆకాంక్ష శర్మ)ను ప్రేమిస్తాడు. ప్రేయసితో రొమాంటిల్ లవ్ ఎంజాయ్ చేస్తున్న సోనూ.. రుస్తుం(అభిమన్యు సింగ్) ఆగ్రహానికి గురవుతాడు. అందమైన అమ్మాయిగా భావించి రుస్తుం ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. తీరా పెళ్ళయాక ఆ అమ్మాయి మేకప్ పోవడంతో నల్లగా, అంద విహీనంగా ఉందని తేలుకుంటాడు. ఆ అమ్మాయికి మేకప్ వేసి సోనూ తనను మోసం చేశాడని రుస్తుం కి కోపం వస్తుంది. అనంతరం ఎలాంటి పరిణాలు చోటు చేసుకున్నాయి అన్నది కథ..

కాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపాయి. ఓ వర్గం లైలా చిత్రాన్ని బాయికాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. సినిమా డిజాస్టర్ కావడంతో మావల్లే అని వారు ఎద్దేవా చేశారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. లైలా మూవీలో మేటర్ లేకపోవడం వలనే ఆడలేదు అనేది వాస్తవం.

 

Also Read: ఇంస్టాగ్రామ్ లో ప్రియుడు విజయ్ వర్మ ఫోటోలను తొలగించిన తమన్నా..నా హృదయం ముక్కలైంది అంటూ కామెంట్స్!