Tamannaah : చాలా కాలం నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamanna bhatia) విజయ్ వర్మ(Vijay Varma) అనే బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం నడుపుతూ, డేటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విజయ్ వర్మ అనే పేరు కేవలం తమన్నా వల్లే ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యింది. హిందీ లో ఆయన అనేక సినిమాల్లో నటించాడు కానీ, నటుడిగా అవేమి అంతగా గుర్తింపుని తీసుకొని రాలేదు. అలాగే తెలుగు లో ఆయన నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన MCA చిత్రంలో విలన్ గా చేసాడు. అయితే తమన్నా ఇతనితో రిలేషన్ ని ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏ స్టార్ హీరోనో పెళ్లాడింది అనుకుంటే, ఇతన్ని ప్రేమించిందేంటి..అసలు ఇతనిలో ఏముంది అంటూ సోషల్ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్ చేసారు.. తమన్నా కూడా అనేక సందర్భాల్లో విజయ్ వర్మ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.
Also Read : ప్రియుడితో తమన్నా విడిపోయినట్లేనా.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మిల్కీ బ్యూటీ ఎఫైర్!
ముద్దు సన్నివేశాల్లో నటించడానికి అసలు ఇష్టపడని తమన్నా, బాలీవుడ్ లో ఒక సినిమాలో విజయ్ వర్మ రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సన్నివేశం లో నటించింది. అదేంటి మీరు మొదటి నుండి ఇలాంటి సన్నివేశాలు చేయడానికి ఇష్టపడరు కదా, మరి ఈ చిత్రంలో ఎందుకు చేసారు అని అడిగితే, నేను రొమాన్స్ చేసింది నా కాబోయే భర్తతోనే కదా, కాబట్టి ఎలాంటి ఇబ్బందికి గురి అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తాను కష్టసమయంలో ఉన్నప్పుడు విజయ్ నాకు ఎంతో అండగా నిలబడ్డాడని, అతను నా జీవితంలో ఎంతో స్పెషల్ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. గత ఏడాది కూడా ఆయనతో మంచి రిలేషన్ లోనే ఉన్నింది కానీ, ఇప్పుడు వీళ్లిద్దరు బ్రేకప్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా లో గత వారం రోజుల నుండి ఇదే చర్చ. దానికి తోడు నేడు తమన్న తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో విజయ్ వర్మతో కలిసున్న ఫోటోలను తొలగించింది.
దీంతో ఫ్యాన్స్ కి కూడా అర్థమైపోయింది. వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అయ్యిందని. కానీ వీళ్ళ మధ్య కేవలం రొమాంటిక్ రిలేషన్ షిప్ మాత్రమే బ్రేక్ అయ్యిందని, స్నేహితులుగా మాత్రం ఎప్పటికీ కలిసుంటారని మరో వార్త కూడా వినిపిస్తుంది. స్నేహితులుగా కలిసి ఉండే ఉద్దేశ్యమే ఉంటే తమన్నా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను ఎందుకు తొలగిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా వీళ్ళు కలిసి ఉన్నారా?, లేదా విడిపోయారా అనేది తమన్నా నే స్వయంగా రెస్పాన్స్ ఇచ్చి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అని వార్తలు వచ్చినప్పుడు, అవును నిజమే అని తమన్నా ఖరారు చేసింది. ఇప్పుడు విడిపోయారు అంటూ వస్తున్న వార్తలపై కూడా ఆమె రెస్పాన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఓదెల 2’ ఈ సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read : ప్రియుడికి తమన్నా హ్యాండిచ్చిందా?.. హాట్ టాపిక్ గా మిల్కీ బ్యూటీ లేటెస్ట్ కామెంట్స్