Prithvi Athi and Vishvak Sen : ఒకప్పుడు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో రాజకీయ పరమైన కామెంట్స్ ఉండేవి కాదు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించేవారు. కానీ ఇప్పుడు సినిమాల ఫంక్షన్స్ లో రాజకీయ పరమైన సెటైర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కమెడియన్ పృథ్వీ ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంత రచ్చ చేసాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ముందుగా విడుదల అయ్యుంటే, ఆ పార్టీ కి 11 సీట్లు కూడా వచ్చేవి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనికి ఎంతో నొచ్చుకున్న వైసీపీ అభిమానులు ‘గేమ్ చేంజర్’ చిత్రం పై సోషల్ మీడియా లో తీవ్రమైన నెగటివిటీ చేసారు. సినిమా బాగుంటే ఎంత నెగటివ్ చేసినా ఆడియన్స్ పట్టించుకోరు,ఎగబడి చూస్తారు అనుకోండి. ఆ సినిమా కంటెంట్ ఆడియన్స్ కి నచ్చకపోవడంతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పృథ్వీ ఇలాంటి కామెంట్స్ చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘సినిమా షూటింగ్ సమయంలో యాదృచ్చికంగా 151 గొర్రెలు ఉండేవి. కానీ చివరికి 11 మిగిలాయి’ అంటూ వైసీపీ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసాడు. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు తీవరమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. లైలా సినిమాని బ్యాన్ చేయండి అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు. సినీ వేడుకల్లో ఇలాంటి జోకర్లను పిలిపించి మా నాయకుడిని అవమానిస్తే అసలు సహించబోమని, గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని, కానీ ఆ సినిమా ఫలితం ఏమైందో మీరంతా చూసారని, లైలా సినిమా ఎలా హిట్ అవుతుందో మేము కూడా చూస్తామంటూ సవాల్ విసిరిరారు. #BANLaila పేరుతో వేల సంఖ్యలో ట్వీట్స్ వేశారు. దీనిపై హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ క్షమాపణలు తెలియచేసాడు.
ఈ సినిమా విడుదలైన రోజే HD ప్రింట్ ఆన్లైన్ లో వదిలేస్తామని వైసీపీ అభిమానులు హెచ్చరించగా, దానికి విశ్వక్ సేన్ స్పందిస్తూ ‘దయచేసి అలా చేయకండి, ఒకరు చేసిన కామెంట్స్ కి వందల మంది కష్టాన్ని బూడిదపాలు చేయొద్దు. అతను చేసిన కామెంట్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు మూవీ టీం కూడా కమెడియన్ పృథ్వీ కి ఫోన్ చేసి ఫైర్ అయ్యినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు వైసీపీ పార్టీ లో ఉంటూ జనసేన పై సంచలన ఆరోపణలు చేసిన పృథ్వీ, ఇప్పుడు ఆయన పుట్టకతోనే జనసేన పార్టీ బ్లడ్ ఫాలోవర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. పృథ్వీ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన పార్టీ అభిమానులు కూడా సొంతోషంగా లేరు. ఈమధ్య ఈయన లిమిట్స్ క్రాస్ చేసున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే లైలా ఈ చిత్రం ఈ నెల 14 వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది.