https://oktelugu.com/

Laila and Brahma Anandya : లైలా, బ్రహ్మా ఆనందం సినిమాల్లో ఒక సినిమా డిజాస్టర్ అయిందా..?మరో సినిమా పరిస్థితి ఏంటి..?

ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికి యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.

Written By: , Updated On : February 14, 2025 / 03:56 PM IST
Laila

Laila

Follow us on

Laila and Brahma Anandya : ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికి యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. చాలామంది టాలెంటెడ్ హీరోలు డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని తద్వారా పాన్ ఇండియాలో కూడా వాళ్ల హవా కొనసాగించడం అనేది ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది…చూడాలి మరి ఇకమీదట ఎలాంటి సినిమాలు చేస్తారు. తద్వారా ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారు అనేది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. యంగ్ హీరో అయిన విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం ‘మాస్ కా దాస్’ గా పేరు తెచ్చుకొని మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక యూత్ ప్రేక్షకులను అలరించడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్,హిట్ లాంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన లేడీ గెటప్ లో చేసిన లైలా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ ని తెచ్చుకోవడంతో సినిమాను చూడడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఇక సినిమా రిలీజ్ కి ముందే నటుడు పృథ్వి చేసిన కొన్ని కామెంట్లు వైరలయ్యాయి. దాంతో సినిమాను బాయికట్ చేయాలి అంటూ చాలామంది ట్విట్టర్లో ‘బాయికాట్ లైలా’ అనే హష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా అన్ని అవాంతరాలను దాటుకొని ఈరోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించడంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది…

ఇక ఈ సినిమాతో పాటు బ్రహ్మానందం(Bramhanandam) అతని కొడుకు అయిన ‘రాజా గౌతమ్’ (Raja Goutham) లీడ్ రోల్ లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ (Bramha Anandam) సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మంచి కథతో తెరకెక్కింది.

కాబట్టి సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఎమోషనల్ గా కూడా ఈ సినిమా అందర్నీ అట్రాక్ట్ చేసింది. తద్వారా ఈ సినిమాకి పాజిటివ్ టాకైతే వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల్లో బ్రహ్మా ఆనందం సినిమానే పై చేయి సాధించింది. మొత్తానికైతే బ్రహ్మానందం తన కొడుకు అయిన రాజా గౌతమ్ కు ఒక మంచి సక్సెస్ ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారనే చెప్పాలి.

ఇక చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కూడా ఒక మెయిన్ లీడ్ లో నటించి సినిమాని సక్సెస్ ఫుల్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. కానీ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ అయితే రాలేదు. అలాగే ఆయన సినిమాల్లో కూడా పెద్దగా నటించడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. వయోభారం పెరిగిపోవడంతో ఆయన సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ అయితే ఇచ్చాడు…