https://oktelugu.com/

Venkatesh-Anil Ravipudi: వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న లేడీ సూపర్ స్టార్…

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొందర్లోనే స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 2, 2024 / 05:06 PM IST

    Vijayashanti in Venkatesh Anil Ravipudi movie

    Follow us on

    Venkatesh-Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 35 సంవత్సరాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు వెంకటేష్…ఒకప్పుడు సోలో హీరోగా తను వరుస సక్సెస్ సాధించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే నటనతో ఎమోషన్ సీన్లను పండించడం లో ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా గుర్తింపు నైతే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈయన ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ వరుస సినిమాలను కూడా చేస్తున్నాడు.

    ఇక ఇప్పుడు ఈయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొందర్లోనే స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం లేడీ అమితాబ్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందిన విజయశాంతి ని కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో విజయశాంతితో నటింపజేశారు.

    ఇక దాంతో ఇప్పుడు వెంకటేష్ తో చేయబోయే సినిమాలో కూడా ఆమె చేత నటింపజేయనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ క్యారెక్టర్ సినిమాకి చాలా కీలకంగా మారిపోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వెంకటేష్ – విజయశాంతి కాంబినేషన్ లో అప్పట్లో కొన్ని సినిమాలైతే వచ్చాయి. అందులో సూర్య ఐపిఎస్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనే దాని పైన ఇంకా స్పష్టత అయితే రాలేదు.

    కానీ విజయ శాంతి క్యారెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సరిలేరు నీకెవ్వరు లో అమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కూడా అలాంటి ఒక పాత్రని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో విజయశాంతి మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది…